కళ్లు చెదిరే అందం | Funday beauty tips 14-04-2019 | Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరే అందం

Apr 14 2019 4:11 AM | Updated on Apr 14 2019 4:11 AM

Funday beauty tips 14-04-2019 - Sakshi

ముఖం కాంతివంతంగా మెరవాలంటే... మార్కెట్లో వందలకు వందలు పోసి కొన్న ఫేస్‌క్రీమ్స్‌ అవసరం లేదు. కాస్త తీరిక చేసుకుని క్లీనప్, స్క్రబ్‌ చేసుకుని, ఆవిరి పట్టించుకుని, ఇరవై నిమిషాల పాటు మాస్క్‌ వేసుకుంటే చాలు. సహజసిద్ధమైన అందం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ఇలాంటి సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే అంటున్నారునిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావాల్సినవి : క్లీనప్‌ : కొబ్బరిపాలు – 1 టేబుల్‌ స్పూన్, తేనె – 1 టీ స్పూన్‌
స్క్రబ్‌ : బియ్యప్పిండి – అర టేబుల్‌ స్పూన్, చిక్కటి పాలు – అర టేబుల్‌ స్పూన్‌
మాస్క్‌:  క్యారెట్‌ గుజ్జు – అర టేబుల్‌ స్పూన్, టమాటా గుజ్జు – పావు టేబుల్‌ స్పూన్, గడ్డపెరుగు – 1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – అర టేబుల్‌ స్పూన్‌
తయారీ : ముందుగా కొబ్బరిపాలు, తేనె ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, చిక్కటి పాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు  క్యారెట్‌ గుజ్జు, టమాటా గుజ్జు, గడ్డపెరుగు, ముల్తానీ మట్టి ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement