మృదువైన మెరుపు | Funday beauty tips | Sakshi
Sakshi News home page

మృదువైన మెరుపు

May 5 2019 12:27 AM | Updated on May 5 2019 12:27 AM

Funday beauty tips - Sakshi

మార్కెట్‌లో కొన్న క్రీమ్స్‌ కంటే.. సహజసిద్ధమైన ఫేస్‌ ప్యాక్సే చర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా కాపాడతాయి. మచ్చలు, మొటిమలు, ముడతలు... ఇలా ఒక్కటేమిటి వయసుతో వచ్చిన సమస్యలను, కాలుష్యం తెచ్చిపెట్టిన ఇబ్బందులను సహజసిద్ధమైన చిట్కాలు పరిష్కరిస్తాయి. అందుకే చాలా మంది ఈ చిట్కాలను తు.చ. తప్పకుండా పాటిస్తారు. నిపుణుల సలహాలు కూడా ఇవే.  మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి: క్లీనప్‌ : కమలా రసం – 2 టీ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్‌ స్క్రబ్‌ : బియ్యప్పిండి – అర టేబుల్‌ స్పూన్, కొబ్బరి పాలు – 1 టేబుల్‌ స్పూన్‌ మాస్క్‌:  కీరదోస గుజ్జు – 3 టీ స్పూన్లు, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు

తయారీ: ముందుగా కమలా రసం, తేనె ఒక చిన్న బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కొబ్బరి పాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కీరదోసగుజ్జు, ముల్తానీ మట్టి ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి.  ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement