బస్సులో బాటసారి | Black lab rides bus alone to dog park | Sakshi
Sakshi News home page

బస్సులో బాటసారి

Jul 2 2017 12:38 AM | Updated on Sep 29 2018 4:26 PM

బస్సులో బాటసారి - Sakshi

బస్సులో బాటసారి

ఆమె ఓ చిన్నపాటి సెలబ్రిటీ. అయినా సరే.. పబ్లిక్‌ బస్‌లో ప్రయాణిస్తుంది. ప్రతీ రోజు తనకు ఇష్టమైన పార్క్‌కి ఆ బస్సులోనే వెళ్లి వస్తుంటుంది.

ఆమె ఓ చిన్నపాటి సెలబ్రిటీ. అయినా సరే.. పబ్లిక్‌ బస్‌లో ప్రయాణిస్తుంది. ప్రతీ రోజు తనకు ఇష్టమైన పార్క్‌కి ఆ బస్సులోనే వెళ్లి వస్తుంటుంది. అందరితో చలాకీగా కలిసిపోతుంది. డ్రైవర్‌ దగ్గర నుంచి ప్రయాణికుల వరకూ అందరినీ కళ్లతోనే పలకరిస్తుంది. ఇందులో వార్తేముంది అనేగా డౌట్‌!? అయితే ఆ సెలబ్రిటీ మనిషి కాదు! జాగిలం!! అవును, జాగిలమే! బస్సు వచ్చే సమయం దాకా వెయిట్‌ చేస్తూ... బస్సు రాగానే ఎక్కి... సీట్‌లో మనుషులు కూర్చున్నట్లు దర్జాగా కూర్చుంటూ... దారి గుర్తు పెట్టుకుని తన స్టాప్‌ రాగానే బుద్ధిగా దిగి బస్సులో వారందరికీ బై చెబుతున్న ఈ కుక్క వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అమెరికాలోని వాషింగ్‌టన్‌లో సీటెల్‌ అనే

ప్రాంతంలో ‘ఎక్లిప్స్‌’ అనే నల్లని కుక్క రోజు ఓ బస్సు కోసం ఎదురు చూసి ఎక్కుతుంది. కుక్కల పార్క్‌లో దిగి టాటా బైబై చెబుతుంది. దాంతో ఆ బస్సు ఎక్కుతున్న ప్రయాణికులంతా దాని తెలివితేటలకు ముచ్చటపడు తున్నారు. మెచ్చుకోలుగా నిమురుతున్నారు. ప్రేమగా దగ్గరకు తీసుకుని సెల్ఫీలు దిగుతున్నారు. ఈ కుక్కగారి విచిత్రమైన ప్రయాణాన్ని ఫేస్‌బుక్‌ యూజర్లు తెగ లైక్‌ చేస్తున్నారు. సుమారు 6,000 లైక్‌లు పట్టేసిన ఈ డాగ్‌ ఇప్పుడు సెలబ్రిటీనేగా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement