స్వీట్ సింగ్ | sweet and sing | Sakshi
Sakshi News home page

స్వీట్ సింగ్

Nov 8 2014 3:15 AM | Updated on Sep 2 2017 4:02 PM

స్వీట్ సింగ్

స్వీట్ సింగ్

‘హైదరాబాద్ స్కూల్ కొరల్ ఫెస్టివల్’ అలరించింది.

 ‘హైదరాబాద్ స్కూల్ కొరల్ ఫెస్టివల్’ అలరించింది. బంజారాహిల్స్ హయత్ హోటల్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో వంద మంది విద్యార్థులు సూపర్బ్ మ్యూజిక్‌కు  అదరహో అనిపించేలా పాటలు పాడారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పాడిన పాశ్చాత్య గీతాలు పరవశింపజేశాయి. హైదరాబాద్ స్కూల్ కొరల్ ఫెస్టివల్’ నిర్వహించడం ఇది రెండోసారి అని హైదరాబాద్ వెస్టర్న్ మ్యూజిక్ ఫౌండేషన్ డెరైక్టర్ జోయే కోస్టర్ అన్నారు. ఈ ఫెస్టివల్ కోసం వర్క్‌షాప్ నిర్వహించామన్న ఆయన...విద్యార్థుల్లో మ్యూజిక్ ద్వారా వ్యక్తిత్వ వికాసం పెంపొదించామన్నారు. విద్యార్థులందరినీ ఇలా ఒక చోట చేర్చడం వల్ల ఐక్యత, ఆరోగ్యకరమైన పోటీతత్వం పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.  
      సాక్షి, సిటీప్లస్
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement