సల్మాన్ పడిపోయాడు! | Salman khan falls in love | Sakshi
Sakshi News home page

సల్మాన్ పడిపోయాడు!

Jul 6 2014 3:17 AM | Updated on Sep 2 2017 9:51 AM

సల్మాన్ పడిపోయాడు!

సల్మాన్ పడిపోయాడు!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ మరోసారి మనసు పారేసుకున్నాడు! తన కిక్ మూవీలో నటించిన జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ను ఈ మధ్యన తెగ పొగిడేస్తున్నాడు.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ మరోసారి మనసు పారేసుకున్నాడు! తన కిక్ మూవీలో నటించిన జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ను ఈ మధ్యన తెగ పొగిడేస్తున్నాడు. ట్విట్టర్‌లో కూడా ఆమెను ఫాలో అవుతున్నాడు. ‘జాక్విలిన్ ఆన్‌లైన్‌లో తె గ సందడి చేస్తుంది. బాగా నవ్విస్తుంది’ అంటూ కితాబు కూడా ఇస్తున్నాడు.
 
 తెరపై స్టార్ కపుల్
 హాలీవుడ్ సూపర్‌స్టార్ కపుల్ బ్రాడ్‌పిట్, ఏంజిలినా జోలీ మళ్లీ కలసి నటించబోతున్నారు. తొమ్మిదేళ్ల కిందట వీళ్లిద్దరూ ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’లో నటించారు. కొత్తగా తెరకెక్కనున్న ప్రేమకథా చిత్రంలో చేయడానికి వీళ్లిద్దరూ మధ్యదరా సముద్రంలోని మాల్టా దీవికి పయనమైనట్లు హాలీవుడ్ టాక్. ఇదొక ప్రయోగాత్మక చిత్రమని ఏంజిలినా చెబుతోంది.
 
 హిప్-హాప్ తారల ఆన్‌లైన్ పోరు
 హిప్-హాప్ తారలు నిక్కీ మినాజ్, ఇగ్గీ అజాలీల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. బ్లాక్ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ అవార్డుల కార్యక్రమంలో నిక్కీ చేసిన ప్రసంగమే ఈ గొడవకు కారణమట. వరుసగా ఐదో ఏడాది ఈ అవార్డు అందుకున్న నిక్కీ, తన ప్రసంగంలో ఇగ్గీ పేరు ప్రస్తావించకుండానే, ఆమెపై దెప్పిపొడుపులకు దిగడంతో మాటల యుద్ధం మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement