‘ఆగడు’ మూవీకి రేడియో సిటీ బ్లూకార్పెట్

‘ఆగడు’ మూవీకి రేడియో సిటీ బ్లూకార్పెట్


రేడియో సిటీ శ్రోతల కోసం ‘ఆగడు’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ ఎఫ్‌ఎం అంటే రేడియో సిటీ 91.1 ఎఫ్‌ఎం.. సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో ‘ఆగడు’ మూవీ బ్లూకార్పెట్ స్క్రీనింగ్‌కు సిద్ధమవుతోంది. మూవీ విడుదలైన తొలి వారాంతంలోనే శ్రోతల కోసం ప్రత్యేకంగా ఈ మూవీ స్క్రీనింగ్‌కు సన్నాహాలు చేస్తోంది.

 

 ఈ సీజన్‌లో రిలీజయ్యే వాటిలో మహేష్‌బాబు, తమన్నా తొలిసారి జంటగా నటిస్తున్న ‘ఆగడు’ మూవీ కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదల సందర్భంగా బ్లూ కార్పెట్ స్క్రీనింగ్‌కు ప్రేక్షకులు పెద్దసంఖ్యలో తరలివచ్చేలా రేడియో సిటీ ఏర్పాట్లు చేస్తోంది. ‘ఆగడు’ మూవీ టికెట్లు గెలుచుకునేందుకు శ్రోతలు రేడియో సిటీ ప్రసారాలను ఆలకించి, తేలికపాటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. రేడియో కార్పెట్ స్పెషల్ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు ‘సాక్షి’ పాఠకులు సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు ‘సిటీప్లస్’లో రేడియో సిటీ ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు పంపాల్సి ఉంటుంది.

 

మహేష్‌బాబు అభిమానులకు ప్రత్యేక అవకాశం

మహేష్ బాబు ఉపయోగించిన బుల్లెట్ వాహనంతో ఫొటోలు దిగేందుకు రేడియో సిటీ అభిమానులకు అవకాశం కల్పిస్తోంది. కూకట్‌పల్లిలోని మంజీరా మాల్‌లో ఉండే ఈ వాహనంతో ఫొటోలు దిగే అవకాశం ఆదివారంతో ముగుస్తుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top