నో ప్రాబ్లమ్! | Sakshi
Sakshi News home page

నో ప్రాబ్లమ్!

Published Fri, Apr 3 2015 2:19 AM

నో ప్రాబ్లమ్!

గ్లామర్ ఫీల్డ్ అనగానే అందంగా కనిపించేందుకు లెక్కకు మించి జాగ్రత్తలు తీసుకంటారు తారలు. ఇక చిన్నా చితక తేడాలుంటే... వాటికి సర్జరీలని... ఫేషియల్స్ అని... మరేదో అని చేయించేసుకుంటారు. నటీమణులైతే ఈ కేర్ మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ... హాలీవుడ్ సుందరి అలీసా మిలనో మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్టుంది.

ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన అలీసా... డెలివరీ అనంతరం వచ్చే స్ట్రెచ్ మార్క్స్‌ను కప్పిబుచ్చే ప్రయత్నమేమీ చేయడం లేదు. పైగా... అవంటే తనకెంతో ఇష్టమని తెగేసి చెప్పింది. లేటెస్ట్‌గా ఈ నలభై రెండేళ్ల అమ్మడు బికినీలో పోజులిచ్చి షాకిచ్చింది. ఓ పక్క సదరు పిక్చర్స్ గ్లోబల్‌గా తెగ పాపులారిటీని తెచ్చేసుకుంటుంటే... మరో వైపు ఆ ‘మార్కులు’ చూసిన సౌందర్యాధకులు ఇదేమిటని ప్రశ్నించారు. వారికిలా జవాబిచ్చిన సెక్సీ తార... అవి తన బ్యూటీ స్పాట్స్ అంటూ మురిపెంగా చెప్పుకొచ్చింది!
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement