‘ఐ యామ్ 20’... | 'I AM 20' documentary film in age of 20 | Sakshi
Sakshi News home page

‘ఐ యామ్ 20’...

Jun 26 2014 12:41 AM | Updated on Sep 2 2017 9:23 AM

‘ఐ యామ్ 20’...

‘ఐ యామ్ 20’...

ప్రఖ్యాత కెమెరామెన్, డెరైక్టర్, దివంగత ఎస్.ఎన్.ఎస్ శాస్త్రి ఫిలిమ్స్ డివిజన్ కోసం రూపొందించిన నాలుగు డాక్యుమెంటరీలను (ఐయామ్ 20- అండ్ ఐ మేక్ షార్ట్ ఫిలిమ్స్-బర్నింగ్ సన్-ఫ్లాష్ బ్యాక్) బుధవారం సాయంత్రం లామకాన్‌లో ప్రదర్శించారు.

ప్రఖ్యాత కెమెరామెన్, డెరైక్టర్,  దివంగత ఎస్.ఎన్.ఎస్ శాస్త్రి  ఫిలిమ్స్ డివిజన్ కోసం రూపొందించిన నాలుగు డాక్యుమెంటరీలను (ఐయామ్ 20- అండ్ ఐ మేక్ షార్ట్ ఫిలిమ్స్-బర్నింగ్ సన్-ఫ్లాష్ బ్యాక్) బుధవారం సాయంత్రం లామకాన్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రాల డీవీడీలను ఆన్‌లైన్ ద్వారా (http://filmsdivision.org/shop)కొనుగోలు చేయవచ్చు. ఒకొక్కటి రూ.100. యూట్యూబ్‌లోనూ పాక్షికంగా చూడవచ్చు.
 
 20-20 తెలీనిదెవ్వరికి? ‘ఐ యామ్ 20’? తెలుసుకోదగ్గ విశేషమే! 1967లో  20 ఏళ్లు నిండిన యువత ఆకాంక్షలను, అవగాహనలను ‘ఐ యామ్ 20’ ద్వారా చూపారు. స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరంలో పుట్టిన వివిధ రాష్ట్రాల యువతీ యువకులు తమ గురించి-సమాజం గురించి ఏమనుకుంటున్నారు? కొన్ని ‘ఆణి ముత్యాలు’!
 
 -    నేను ఐఏఎస్ ఆఫీసర్‌నవుతాను. ఎ.సిలో కూర్చుంటాను. కాఫీలు తాగుతాను. రెండు సంతకాలు పెట్టేస్తాను. బస్...
 -    బస్సుల్లో సీట్లు లేవు. రైళ్లల్లో సీట్లు లేవు. మంచి మార్కులతో అడ్మిషన్ కోసం కాలేజీకి వెళితే సీట్లు లేవు. ఎంత కావాలి? అని డబ్బు తీయగానే, బొటాబొటి మార్కులొచ్చినా ‘వెంటనే జాయిన్‌కా’ అంటున్నారు. ఇది మారాలి.
 -    నాకు రెండు బక్క ఎడ్లున్నాయి. వ్యవసాయం చేసేందుకు ట్రాక్టర్ కావాలి.
 -    వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నాను. ఐటిఐలో సీటొస్తే సరేసరి. లేకపోతే మిలట్రీకి పోతాను.
 -    రాష్ట్రపతి ఎవరో, ప్రధాని ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో తెలీదు.  పొలం పని తెలుసు.
 -    ప్రేమజోలికి పోను. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటాను.
 పెళ్లి-పెటాకులు వద్దు. ఇష్టం వచ్చినట్లు జీవిస్తా.
 -    నేను ఏ పనీ చేయను. డబ్బులు పారేస్తాను. కావాల్సినవి పొందుతాను.
 -    సత్యజిత్ రాయ్‌ని నేను స్వప్నిస్తాను. ఇండియాకు సమస్యలున్నాయి. అవకాశాలూ ఉన్నాయి. ఐ డూ సమ్ థింగ్ ఫర్ మై కంట్రీ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement