మెరిసేదంతా బంగారం కాదు.. అందరికీ తెలిసిన సామెత. ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం మగువలను మురిపింపజేసేదంతా బంగారమే. పసిడితో ప్రాణం పోసుకుని నిగనిగలాడే నగలకు దీటుగా ధగధగలాడే ఆభరణాలు ఫ్యాషన్ సెక్టర్‌లో ఎన్నో ఉన్నాయి. వీనులను మెరిపించే దుద్దులైనా.. మెడను హత్తుకునే నెక్లెస్ అయినా.. మట్టితో తయారై మాణిక్యాల్లా మెరుస్తూ.. పుత్తడి ఆభరణాలను మరిపిస్తున్నాయి. అందుకే మనసుకు నచ్చి.. తనువుకు నప్పే నగలైతే చాలు.. దాన్ని దేంతో చేశారన్నది అప్రస్తుతం అంటున్న నారీమణులకు టైట జ్యువెలరీ వరంగా మారింది.
మగువలకు జ్యువెలరీ కంటే ఇష్టమైంది మరొకటి ఉండదు. అందుకే స్వర్ణాభరణాలు ఎన్ని ఉన్నా.. మార్కెట్‌లోకి వచ్చే నయా ట్రెండ్ జ్యువెలరీని పక్కాగా ఫాలో అవుతుంటారు. నల్లపూసల హారం, చంద్రహారం, నెక్లెస్, వంకీలు, జుంకాలు.. బంగారంతో ఒక సెట్ చేయించుకోగలరు. కాస్త సిరిమంతుల ఇంతులైతే.. రెండు డిఫరెంట్ సెట్ల జ్యువెలరీ చేయించుకోగలరు. ఇన్ని ఉన్నా.. ట్రెండ్ మారిన ప్రతిసారీ దానికి తగ్గట్టుగా జ్యువెలరీ చేయించుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు కదా..! అందుకే 1 గ్రామ్ గోల్డ్ వైపో.. రోల్డ్‌గోల్డ్ వైపో మొగ్గుచూపుతారు. ఈ కేటగిరీ మహిళలను టార్గెట్ చేసిన జ్యువెలరీ డిజైనర్లు టైట టెంపుల్ జ్యువెలరీకి అదనపు సొబగులు అద్ది మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు.
మట్టితో మాణిక్యాలు..
ప్రజెంట్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ.. ట్రెడిషనల్ లుక్ మిస్ కాకుండా మన ముందుకు వచ్చిన మోడల్ టైట టెంపుల్ జ్యువెలరీ. టైట బొమ్మల మాదిరి ఈ ఆభరణాలు కూడా మట్టితో తయారైనవే. మన్నుతో మన్నికైన ఆభరణాలు చేయడం అంటే మామూలా..! అందుకే బంగారు ఆభరణాలు చేసినంత జాగ్రత్తగా వీటిని తయారు చేస్తారు. లక్ష్మీ, సరస్వతీ దేవి వంటి దేవతా రూపాలు, విభిన్న డిజైన్లను లాకెట్లుగా మలిచి.. వాటికి రుద్రాక్షలు, ముత్యాలు, పగడాలు, రకరకాల రత్నాలు పొందికగా అటాచ్ చేసి జ్యువెలరీ లుక్ తీసుకొస్తారు. మట్టితోనే జుంకాలు సైతం తయారు చేస్తున్నారు. ఇన్నోవేటివ్ లుక్ సొంతం చేసుకున్న ఈ మట్టి ఆభరణాలను యువతుల నుంచి అమ్మమ్మల వరకు అందరూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
హ్యాండిల్ విత్ కేర్..
అన్ని రకాల సంప్రదాయ వస్త్రశైలులకూ ఈ జ్యువెలరీ అతికినట్టు సరిపోతుంది. అంతేకాదు ఫ్యాషన్ వేరింగ్‌కు నప్పుతుండటంతో యువతులు కూడా వీటిపై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. చీరకట్టులో, చుడీదార్‌లో, లంగాఓణి, గాగ్రాచోలీ ఇలా ఏ రకమైన డ్రెస్సింగ్ చేసుకున్నా వాటిపైకి ఇవి ఇట్టే సెట్ అయిపోతున్నాయి. పైగా ధర తక్కువగా ఉండటంతో.. పండుగలకు, పబ్బాలకు తమ డ్రెస్సింగ్‌కు మ్యాచ్ అయ్యే మోడల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు కొందరు. అంతేకాదు ఎప్పుడూ బంగారంలో మెరిసి బోర్ కొట్టిన వారు కాస్త డిఫరెంట్‌గా కనిపించడానికి కూడా వీటికి తమ జ్యువెలరీ సెట్లలో చోటిస్తున్నారు. అయితే వీటిని హ్యాండిల్ చేయడంలో మాత్రం జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు డిజైనర్లు. మట్టితో చేసినవి కావడంతో ఏ మాత్రం చేజారినా.. పగిలే అవకాశం ఉంది. సో హ్యాండిల్ విత్ కేర్.. హ్యాపీ విత్ వేర్. శిరీష చల్లపల్లి
అన్నుల మన్నుల
Published Mon, Mar 23 2015 11:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement