శోక సంచి

women empowerment :  special on Uterus - Sakshi

మళ్లీ చెప్పుకుందాం!

రీటోల్డ్‌ కథలు – 05

లేబర్‌ రూమ్‌ అరుపుల్ని మగవాడు వినాలి. అవి ఇంట్లో గదిలో అర్ధరాత్రి ఏకాంతంలో వినవచ్చే మూల్గులు కావు. అరుపులు. కేకలు. గావుకేకలు. పేగులు తెగిపడే కేకలు. కాదు.. కాదు... గర్భసంచి చిరిగిపోయే కేకలు.... అవి వింటాడా మగవాడు? పడతాడా పోనీ. పడితే తెలుస్తుంది. ‘అల్లా... ముఝే బచాలే అల్లా’... కేకలు పెడుతోంది. ఒకటో కాన్పు కాదు. రెండో కాన్పు కాదు. మూడోది నాల్గోది కాదు. ఐదోది. పెనిమిటికి మగబిడ్డ కావాలట. ఈసారీ ఆడపిల్ల పుడితే ఏం చేస్తాడో. ఏట్లో తోస్తాడో ఏమో. ‘ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇంకో గర్భసంచి మీద ప్రతాపం చూపుతాడు’ అంటుంది నర్సు పిల్ల. ఆ పిల్లకు ఓర్పు చాలా జాస్తి. ఆ పిల్ల సాయం వల్లే చాలా కాన్పులు ఆ ఆస్పత్రిలో జరుగుతుంటాయి. ఆ పిల్ల లేకపోతే డాక్టరు లేబర్‌ రూమ్‌లోకి వెళ్లదు. ఇద్దరూ కలిసి చాలా కేసులే చూశారు. ‘ఈ కేసు దుబాయ్‌ది డాక్టర్‌. తీసుకెళ్లి ఆరునెలలు పెట్టుకున్నాడు. ఇలా చేసి పంపాడు. కాన్పైనాక తిరిగి తీసుకెళ్తాడని ఈ అమాయకురాలి వెర్రి. వాడు ఖాజీకి ఈసరికి ఇంకో పిల్లకు గేలం వేయమని చెప్పేసి ఉంటాడు’ అంటుంది నర్సుపిల్ల.

‘ఈ పిల్లది మరీ అన్యాయం. సొంత బాబాయే’... అని ఇంకో టేబుల్‌ దగ్గర నిలబెడుతుంది. ‘ఈమెను చూశారా మళ్లీ వచ్చింది. నలభై ఏళ్లు రాబోతున్నా వచ్చిందంటే ఏమనాలి. ఆపరేషన్‌ అంటే ఆయన వినడు... రాత్రి మీదిమీదికొస్తుంటే ఈమె కాదనలేదు’ అంటుంది మరో టేబుల్‌ దగ్గర. ‘క్యా ఖాలా... మళ్లీ వచ్చావా?’ ఆమె ఏడుస్తుంది.  ‘ఆయన వినడమ్మా... ఆపరేషన్‌ అంటే వినడు. నా గర్భసంచి చిరిగి నేను పనికి రాకుండా పోతే తప్ప ఇంతే. కంటూ ఉండాల్సిందే’ అంటుంది. పాతబస్తీ చుట్టుపక్కల ప్రసూతి ఆస్పత్రి అంటే కథలు జాస్తి. కన్నీరు జాస్తే. ‘అల్లా... ఈసారైనా రహమ్‌ చూపు. మగపిల్లాణ్ణి ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టు. ఇంకా నన్ను సాధించకు ఊపర్‌వాలే’ లేబర్‌ రూమ్‌లో నుంచి ఆవిడ పెద్ద పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఉంది. చూడాలి అల్లా ఏం చేయబోతున్నాడో. ఈ లోపల నర్సు పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది.

‘డాక్టర్‌... ఎమర్జెన్సీ’...మాసిన బురఖాలేసుకున్న ముగ్గురు నలుగురు ఒకామెను మోసుకుంటూ వచ్చారు. ఆమె కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఉంది. వంకరగా తిరిగి పోతూ ఉంది. దవడలు గిట్ట కరుస్తూ ఉంది. పిల్లల్లాగుంది... ఇద్దరు చిన్నపిల్లలు... తల్లిని పట్టుకుని ఏడుస్తున్నారు.‘ఏమైంది?’ డాక్టర్‌ అడిగింది.‘ఏమో డాక్టర్‌. అచానక్‌ ఇలా అయింది’‘ఏమైనా మింగిందా... చెప్పండి’ ‘ఏమో... మాకేం తెలుసు’
వెనుక మొగుడు వచ్చాడు. నలిగిన బట్టలేసుకుని... జుట్టు పెరిగిపోయి... వెర్రి ముఖంతో.‘కొట్టినావా?’‘నై నై... అల్లా కసమ్‌’నాడీ పట్టుకు చూసింది. బాగానే ఉంది. బీపీ– నార్మల్‌. గదిలో నుంచి అందర్నీ వెళ్లగొట్టి తలుపులేసి నిలబడింది. అంతవరకూ వంకర్లు పోయిన ఆమె మామూలుగా అయ్యి  ముఖం దిగులుగా పెట్టింది.‘ఏంటీ పని?’ ‘ఏం చేయను డాక్టర్‌.. మీరే కాపాడాలి. బస్తీలో ఉంటాము. మా ఆయన ఆటో వేస్తాడు. ఇప్పటికి నలుగురు పిల్లలు. ఆపరేషన్‌ వద్దంటాడు. అలాగని దూరం ఉంటాడా. ఉండడు. రాత్రయితే తాగొచ్చి పక్కన చేరుతాడు. ఇప్పటికే తినడానికి తిండి లేదు. నేను కూడా మెహనత్‌ చేస్తేనే ఒక పూటైనా ముద్ద నోట్లోకి పోతోంది. ఇంక నాకు కనే ఓపిక లేదు. ఇంకొక్క కడుపంటే ఉత్తపుణ్యానికే చచ్చిపోతాను. నా ప్రాణం బాగలేదని గుండె జబ్బు ఉందని ముట్టుకుంటే చచ్చిపోతానని నా మొగునికి చెప్పండి. ఈ పుణ్యం చేశారంటే మీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగుతాను. లేకుంటే మా ఉసురు దేవుడే పోసుకుంటాడు’... వెక్కిళ్లు పెట్టింది.

డాక్టర్‌ తలుపు తెరిచి అని అందరూ చూసేలా రెండు మూడు ఇంజెక్షన్లు పొడిచింది. మొగుణ్ణి పిలిచి ఆమె చెప్పమన్నట్టే చెప్పింది.అతడు ముఖం చిన్నగా పెట్టుకుని జేబులో నుంచి దస్తీ తీసి కళ్లు దాచుకున్నాడు.‘ఎందుకేడుస్తున్నావ్‌’‘ఇదంతా నా తాగుడు వల్లే డాక్టర్‌. ఇంతకు ముందు ఇలా లేకుండె. ఈ మధ్య గిరాకీ సరిగా లేదు. ఓలాలు ఊబర్లని సిటీ అంతా క్యాబులు తిరుగుతున్నాయ్‌. ఆటోలు నడవట్లేదు. నడిచినా నావంటి ఖటరా ఆటోలను ఎవరూ ఎక్కడం లేదు. రాత్రయితే హైబత్‌తో మందు తాగుతున్నాను. తాగాక దీని పక్కన చేరుతున్నాను. మా బతుకుల్లో సినిమాలు షికార్లు ఉండవుగా డాక్టర్‌. హోటళ్లు రెస్టారెంట్లు తెలియదు. ఈ ఊరు తప్ప ఏ ఊరు తిరిగేది లేదు. నెక్లెస్‌ రోడ్డుకు కూడా వెళ్లేది లేదు. కడుపుకు సరిగా తిండే లేదు. మాకున్న ఒకే ఒక దిల్‌ బెహలాయి మొగుడికి పెళ్లాం... పెళ్లానికి మొగుడు... ఇప్పుడు అది కూడా వద్దంటున్నారు.. సరే కానివ్వండి... ఇక మీదట ఆమెను తాకనులేండి’.. ఏడుస్తూనే ఉన్నాడు. 
ఇది అతడి కథ . అది ఆమె కథ.

లేబర్‌ రూములో‘మగబిడ్డ కావాలి పరవర్‌దిగార్‌’ అని అరుస్తున్నదే ఆమె కథ అల్లాది.అంతులేని ఈ కథ సాగుతూనే ఉంటుందా?డా.గీతాంజలి రాసిన ‘బచ్చేదాని’ కథ ఇది.అంటే ‘గర్భసంచి’ అని అర్థం. గర్భసంచి మీద హక్కు ఎవరికి? అది కలిగిన స్త్రీకా? అందులో బీజం వేసే పురుషునికా? ఆమె జన్మించిన సమూహానికా? కులానికా? మతానికా? దేశానికా? ఆ హక్కు ఎవరికి? తన గర్భసంచికి తానే తాడు కట్టి మూత బిగించే హక్కు, తన గర్భాన్ని తానే నిరాకరించే హక్కు, ఆ గర్భంలో ఏది ఉద్భవిస్తే దానినే స్వీకరించి కాపాడుకునే హక్కు స్త్రీకి నిజంగా ఉన్నదా?  లేనంత వరకూ అది గర్భసంచి కాదు. శోక సంచి.
పునః కథనం: ఖదీర్‌
- ∙డా. గీతాంజలి 

More news

14-02-2018
Feb 14, 2018, 14:03 IST
ముంచుద్దో లాభమొస్తదో..చెప్పలేని ఎవుసాన్ని మహిళలు ధైర్యంగా చేస్తున్నారు. కుటుంబ భారం మోసేందుకు, తమపై ఆధారపడిన వారికి అండగా నిలిచేందుకు లాభాల...
14-02-2018
Feb 14, 2018, 13:53 IST
కడదాకా కలిసుంటానన్న మగ దిక్కు మధ్యలో ‘కాడి’ దింపేశాడు. అప్పులు బాధతో కొందరు, అనారోగ్యంతో మరికొందరు భార్య, పిల్లలను వదిలేసి...
14-02-2018
Feb 14, 2018, 13:00 IST
నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వ్యవసాయంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. భర్తకు చేదోడుగా ఉంటూ వ్యవ‘సాయం’ చేస్తున్న వారు...
14-02-2018
Feb 14, 2018, 12:57 IST
అది 1980 దశకం..అప్పుడప్పుడే కరాటే అంటే యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఒంగోలులో డిగ్రీ చదువుతున్న పద్మజ కూడా ఆ యుద్ధ...
14-02-2018
Feb 14, 2018, 12:03 IST
తాగుడుకు బానిసై ఒకరు.. విద్యుదాఘాతానికి గురై మరొకరు.. మనస్తాపంతో ఇంకొకరు..! ఇలా వేర్వేరు కారణాలతో ఇంటి యజమానులు కుటుంబాన్ని వదిలేసి కానరాని...
14-02-2018
Feb 14, 2018, 10:05 IST
అడగకుండానే ఆకలి పేగులకు అన్నం ముద్దయ్యేఅమృతమూర్తి అమ్మ కూడా ఓ ఆడపిల్లే..కష్టాల సగాన్ని కడుపులో దాచుకుని..  ఆనందాలసగాన్ని కట్టుకున్నోడికి పంచే...
14-02-2018
Feb 14, 2018, 02:12 IST
‘‘వస్తావా!’’ ఇదీ ప్రేమించిన వాడి దగ్గర్నుంచి ఇప్పటి దాకా తను విన్న మగవాడి కూత. కానీ, తనకు ఆ వికృత...
14-02-2018
Feb 14, 2018, 02:05 IST
పెద్దలంతా కలిసి ముహూర్తం పెట్టారు. శుభముహూర్తం అని భర్త తరుఫు వాళ్లు అన్నారు. ఇటు పక్కవాళ్లు నోరు మూసుకున్నారు. ఎవరికి...
14-02-2018
Feb 14, 2018, 01:29 IST
తరం మారి తరం వచ్చింది. తరం మారి తరం వస్తుంది కూడా. అప్పుడు కూడా.. ఇలాంటి ఉత్తరమే వస్తుంది. సరస్వతీదేవి,...
14-02-2018
Feb 14, 2018, 01:19 IST
♦  పోకడకు భిన్నంగా మీ అమ్మ నాన్న మిమ్నల్ని  పెంచి పెద్దచేశారా? ♦  ఎటువంటి వివక్షా అంటకుండా ఎదగనిచ్చారా? ♦  అన్నింటా మీ...
13-02-2018
Feb 13, 2018, 16:14 IST
ఆమె చిన్నతనంలోనే పోలియో బారిన పడింది. నడిచేందుకు కాళ్లు సహకరించలే. చదివేందుకు ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించలే. పేదరికంలో పుట్టిన...
12-02-2018
Feb 13, 2018, 14:22 IST
 స్త్రీ  ఇంటిని, పిల్లల్ని చక్కదిద్దుతుంది... బంధాలు నిలబెడుతుంది..  గృహిణిగా బాధ్యతలన్నీ నిర్వర్తిస్తుంది.. వీటన్నిటితో పాటు కార్యక్షేత్రంలో నిరంతరం ఎదురయ్యే సవాళ్లు...
13-02-2018
Feb 13, 2018, 13:50 IST
‘సమాజంలో మార్పు వచ్చింది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
13-02-2018
Feb 13, 2018, 13:27 IST
జనగామ: ‘‘ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పురుషులతోపాటు మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి.. పార్లమెంట్, అసెంబ్లీలో రిజర్వేషన్లు,  సమాజంలో తగిన గౌరవం...
13-02-2018
Feb 13, 2018, 12:37 IST
ఇంట్లో మగవారే సంపాదించాలి. ఆడవాళ్లు ఇంటి పనులకే పరిమితమవ్వాలి...చాలా కుటుంబాల్లో కనిపించేది ఇదే. కానీ భర్త ప్రభుత్వోద్యోగి అయినా ఆయనపై...
13-02-2018
Feb 13, 2018, 12:26 IST
ఆడపిల్లల పెంపకంపై ముందుగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను చూడాలి.
13-02-2018
Feb 13, 2018, 12:17 IST
‘కష్టాలు రానీ.. కన్నీళ్లు రానీ.. ఏమైనా కానీ.. ఎదురేది రానీ.. ఓడిపోవద్దు.. రాజీపడొద్దు’ అన్నట్టుగా బతుకు పోరు సాగిస్తోంది. భర్త...
13-02-2018
Feb 13, 2018, 12:09 IST
మహిళలంటే వివక్ష ... ‘ఆ... ఏం చేస్తారు...ఏమి అడుగుతారులే ... మనం ఏదంటే అదే అనే ధీమా’. ఆ అధికార...
13-02-2018
Feb 13, 2018, 12:02 IST
తోటి పిల్లలు చెంగు చెంగున ఎగురుతుంటే చిన్ని మనసు బాధపడింది.
13-02-2018
Feb 13, 2018, 11:33 IST
ఒకప్పుడు వారి వృత్తి వ్యవసాయం..పొలంలో పనిచేస్తేగాని కుటుంబాలు గడిచేవి కావు. ఎంత కష్టపడినా మిగులు బాటు ఉండేది కాదు. ప్రకృతి...

More Photos

More Videos

Back to Top