నిద్రలేమితో కిడ్నీలకు ముప్పు | With the threat of insomnia kidney | Sakshi
Sakshi News home page

నిద్రలేమితో కిడ్నీలకు ముప్పు

Dec 1 2015 10:44 PM | Updated on Aug 24 2018 8:18 PM

నిద్రలేమితో కిడ్నీలకు ముప్పు - Sakshi

నిద్రలేమితో కిడ్నీలకు ముప్పు

నిద్రలేమితో నానా మానసిక, శారీరక సమస్యలు వస్తాయనే సంగతి తెలిసిందే.

పరిపరి శోధన

నిద్రలేమితో నానా మానసిక, శారీరక సమస్యలు వస్తాయనే సంగతి తెలిసిందే. నిద్ర తక్కువైతే ముఖ్యంగా ఏకాగ్రత లోపిస్తుంది. అలసటగా అనిపిస్తుంది. దీర్ఘకాలం పాటు నిద్ర తక్కువైతే గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లుగా పలు పరిశోధనల్లో ఇప్పటికే తేలింది.

అయితే, నిద్రలేమి వల్ల మరో ముప్పుకూడా పొంచి ఉందని అంటున్నారు అమెరికన్ నిపుణులు. రోజుకు ఐదు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు 65 శాతం మేరకు ఎక్కువవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. బ్రిగ్‌హామ్, బోస్టన్, మసాచుసెట్స్‌కు చెందిన వైద్య నిపుణులు నిద్రలేమితో బాధపడే నాలుగువేల మందిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయాన్ని నిగ్గుతేల్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement