
బోల్డ్... వెరీ బోల్డ్! పాటల్లో అమీ జాక్సన్‌ని చూసినోళ్లు ఎవరైనా ఈ మాట అనాల్సిందే. సాంగుల్లో అమీ అప్పియరెన్స్ అంత స్పెషల్‌గా ఉంటుంది మరి! కానీ, సాంగ్ షూటింగు మాత్రం వెరీ వైల్డ్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నారామె. నాలుగు రోజులుగా చెన్నైలో స్పెషల్‌గా వేసిన సెట్‌లో ‘2.0’ కోసం రజనీకాంత్, అమీలపై దర్శకుడు శంకర్ ఓ సాంగ్ తీస్తున్నారు.
ఆల్రెడీ ఈ పాట కోసం అమీ మామూలుగా రిహార్సల్స్ చేయలేదు. అల్మోస్ట్ టెన్ డేస్ ప్రాక్టీస్ చేశారు. అయినా... షూటింగులో తిప్పలు తప్పడం లేదట! శుక్రవారం రాత్రి ‘వైల్డ్ ఫ్రైడే నైట్స్... ఆన్ సెట్’ అని ఇన్‌సెట్‌లో ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
సెట్‌లో ఆర్టిస్టులను గాల్లో గింగిరాలు కొట్టిస్తున్నారంటే... పాటను ఏ రేంజ్‌లో తీస్తున్నారో మరి! ‘రోబో’కి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాలో అమీ జాక్సన్ రోబోగా నటిస్తున్నారనేది చెన్నై గుసగుస. మరది నిజమో? కాదో? సినిమా విడుదలైన తర్వాత చూడాలి! రీసెంట్‌గా రిలీజ్ చేసిన అమీ ఫస్ట్ లుక్ మాత్రం రోబోలానే ఉంది!!