విజయవంతంగా సాక్షి ‘మైత్రి మహిళ’ | Who successfully completed the woman ' | Sakshi
Sakshi News home page

విజయవంతంగా సాక్షి ‘మైత్రి మహిళ’

Apr 23 2014 11:57 PM | Updated on Sep 2 2017 6:25 AM

విజయవంతంగా సాక్షి ‘మైత్రి మహిళ’

విజయవంతంగా సాక్షి ‘మైత్రి మహిళ’

మహిళలు ఆత్మవిశ్వాసంతో, నైపుణ్యంతో ముందడుగు వేసేందుకు, స్వయం ఉపాధితో మెరుగైన భవితనందుకొనేందుకు ‘సాక్షి’ ప్రారంభించిన శిక్షణా కార్యక్రమం...

మైత్రి మహిళ
 

సాక్షి, సిటీబ్యూరో: మహిళలు ఆత్మవిశ్వాసంతో, నైపుణ్యంతో ముందడుగు వేసేందుకు, స్వయం ఉపాధితో మెరుగైన భవితనందుకొనేందుకు ‘సాక్షి’ ప్రారంభించిన శిక్షణా కార్యక్రమం ‘మైత్రిమహిళ’కు విశేష స్పందన వస్తోంది. బుధవారం బంజారాహిల్స్‌లోని ‘మైత్రి మహిళ’ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కుకరీ వర్క్‌షాప్ (వంటల శిక్షణ) కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.

ప్రముఖ చెఫ్ బినా ప్రత్యేకించి కేక్‌లను తయారు చేయడంలో మెలకువలను నేర్పించారు. ‘మైత్రి మహిళ’లో... ఫ్యాబ్రిక్ పెయింటింగ్, త్రీడీ మ్యూరల్ ఆర్ట్, ఎంబ్రాయిడరీ స్టయిల్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్ వంటి హస్త కళలు, బేకరీ బిస్కెట్లు, కేకులు, వివిధ రకాల గ్రేవీ కూరలు చేయడంలో శిక్షణ, వివిధ రకాల టైలరింగ్ కోర్సులు, పౌష్టికాహారం ఆరోగ్యాన్ని రక్షించుకోవడం వంటి వివిధ అంశాలలో శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తోంది.

ఇంకా... న్యాయపరమైన సలహాల కోసం, ఆదాయాన్నందించే తమకిష్టమైన కోర్సుల వివరాలు కూడా తెలియచేస్తుంది. ఆసక్తి ఉన్నవారు 9505555020 నంబరుకు సంప్రదించి రిజిస్టర్ చేసుకోండి.
 

Advertisement
 
Advertisement
Advertisement