గ్యాడ్జెట్స్ ఉన్నవాడే గ్రీకువీరుడు! | who have gadgets they only heros ! | Sakshi
Sakshi News home page

గ్యాడ్జెట్స్ ఉన్నవాడే గ్రీకువీరుడు!

Jan 29 2014 12:04 AM | Updated on Jul 12 2019 3:37 PM

గ్యాడ్జెట్స్ ఉన్నవాడే గ్రీకువీరుడు! - Sakshi

గ్యాడ్జెట్స్ ఉన్నవాడే గ్రీకువీరుడు!

ఒకప్పుడు అమ్మాయిలను మీకెలాంటి భర్త కావాలి అని అడిగితే... ప్రేమించేవాడు, పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు, అర్థం చేసుకునేవాడు... అంటూ సమాధానాలు చెప్పేవారు.

 ధోరణి
 ఒకప్పుడు అమ్మాయిలను మీకెలాంటి భర్త కావాలి అని అడిగితే... ప్రేమించేవాడు, పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు, అర్థం చేసుకునేవాడు... అంటూ సమాధానాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఈ ఆన్సర్ మారింది. లేటెస్ట్ గ్యాడ్జెట్స్ మీద, టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవాడు కావాలని చెబుతున్నారు. ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ చేసిన అధ్యయనంలో వెలువడిన వాస్తవమిది!
 
 అప్‌డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో వస్తున్న ఖరీదైన ఫోన్లను వాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు విపరీతమైన క్రేజ్ ఉందట. అబ్బాయి క్యారెక్టర్‌ను అంచనా వేయడానికి ఫేస్‌బుక్ ఒక ఉత్తమమైన మాధ్యమం అని అమ్మాయిలు భావిస్తున్నారు. వాళ్లు ఎలాంటి పోస్టులను షేర్ చేస్తున్నారు, ఎలాంటి పేజ్‌లను లైక్ చేస్తున్నాడు అనే విషయాలను బట్టి అబ్బాయిల క్యారెక్టర్ మీద ఒక అంచనాకు వస్తున్నామని ఆ పెళ్లి సంబంధాల సైట్‌లో నమోదు చేసుకున్న అమ్మాయిలు పేర్కొన్నారు. ట్విటర్‌లో అకౌంట్ ఉన్న అబ్బాయి జగమెరిగినవాడిగా ఉంటాడని అనుకొంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement