పట్టుకు సింగారం

A Variety Of Fashion Jewelery Is Available To Wear On Silk Sarees - Sakshi

ఆభరణం

ఏ చిన్న వేడుకైనా మగువలు పట్టుచీర ధరించడం వైపే మొగ్గుచూపుతారు. దాని మీదకు సంప్రదాయ బంగారు ఆభరణాలను ఎంపిక చేసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పట్టుచీర మీదకు ధరించడానికి రకరకాల ఫ్యాషన్‌ జువెల్రీ అందుబాటులోకి వచ్చింది. ఇండోవెస్ట్రన్, వెస్ట్రన్‌ డ్రెస్సులకు నప్పే ఈ ఆభరణాలు చీరకట్టు మీదకు ఇప్పుడు ఒద్దికగా ఒదిగిపోతున్నాయి.

►సంప్రదాయ చీరకట్టు అయినా ఈ రోజులకు తగినట్టుగా ట్రెండీగా కనపడాలనేది యువతుల ఆలోచన. వీటిలో ఫ్యాషన్‌ జువెల్రీలో భాగమైన సిల్వర్, కుందన్, పూసలు, రత్నాలతో చేసిన వెస్ట్రన్‌ డిజైన్‌వేర్‌ బాగా నప్పుతుంది. వీటిలో పొడవాటి హారాలు, మెడను చుట్టేసే చోకర్స్‌ ఉంటున్నాయి.

►ఫ్యాషన్‌ జువెల్రీలో చెప్పుకోదగినది థ్రెడ్‌ జువెల్రీ. ఇది రకరకాల డిజైన్లలో రంగులలో పట్టుచీరల మీద కొత్తగా మెరుస్తోంది. ఈ ఆభరణాల్లో చీర అంచులు, ప్రింట్ల రంగులను తీసుకొని డిజైన్లు సృష్టిస్తున్నారు. ప్లెయిన్‌ పట్టుచీర అయితే, దాని మీదకు కాంట్రాస్ట్‌ లేదా మ్యాచింగ్‌ కలర్‌ థ్రెడ్‌ జువెల్రీ ధరిస్తే అద్భుతంగా ఉంటుంది.

►థ్రెడ్‌ జువెల్రీతో పాటు చెప్పుకోదగినది టెర్రకోట ఆభరణాలు. ఈ డిజైన్స్‌ సంప్రదాయపు సొబగులు అద్దడంలో సరైన పాత్ర పోషిస్తున్నాయి.

►సంప్రదాయ పట్టుకు ఈ తరహా ఆభరణాలే ధరించాలనే నియమాలేవీ లేవు. ఫ్యాషన్‌ జువెల్రీతో లుక్‌లో కొత్త మార్పులు తీసుకోవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top