ఇది లో జ్వరం కాదు.
మెడిక్షనరీ
ఇది లో జ్వరం కాదు. లోయ జ్వరం. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే వ్యాలీ ఫీవర్. అమెరికా ఖండంలోని నైరుతి ప్రాంతం, మెక్సికో దేశం, దక్షిణ అమెరికా ఖండంలోని కొన్నిదేశాల్లో ఉండే లోయల్లోని మట్టిలో ఒక రకం ఫంగస్ పెరుగుతుంది. ఇటీవల వాషింగ్టన్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ దీన్ని గుర్తించారు.
ఈ ఫంగస్ పేరే ‘కాక్సిడియోడ్స్’. ఆ ప్రాంతాల్లోని లోయల్లో ఉన్న మట్టివాసనను పీల్చడం వల్ల వచ్చే జబ్బు కాబట్టి దీన్ని వ్యాలీఫీవర్ అని పేర్కొంటారు. దాన్నే వైద్యపరిభాషలో కాక్సిడియోడోమైకోసిస్ అంటారు. ఈ జబ్బు వచ్చిన వారు కొన్ని వారాల్లోనే మళ్లీ మామూలుగా కోలుకుంటారు.