యాడ్‌ ఫిల్మ్‌తో అవకాశం

TV Artist Poornika Sanvi Chit Chat ith Sakshi

నటి పూర్ణికాసాన్వి

‘అగ్నిపూలు’ సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయమైన నటి పూర్ణికాసాన్వి. తెలుగింటి అమ్మాయి పూర్ణిక సీరియల్స్‌తో పాటు యాడ్‌ ఫిల్మ్స్‌లో మోడల్‌గా చేస్తూ, షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటిస్తూ, తమిళంలోనూ రాణిస్తోంది. మంచి నటిగా గుర్తుంపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యం అంటున్న పూర్ణిక చెబుతున్న ముచ్చట్లివి.

‘‘మాది వైజాగ్‌. నాన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. అమ్మ గృహిణి. అన్నయ్య చదువుకుంటున్నాడు. మా నాన్న క్లోజ్‌ ఫ్రెండ్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేస్తున్నారు. మోడల్‌గానే చేసిన ప్రకటనలు, షార్ట్‌ ఫిల్మ్స్‌ చూసి ‘అగ్నిపూలు’ సీరియల్‌లో నటించేందకు అవకాశం ఇచ్చారు. ఏడాదన్నరపాటు చేసిన ఆ సీరియల్‌లో నా పాత్రకు మంచి పేరొచ్చింది. ‘ప్రణవి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయినందుకు ఆనందంగా ఉంది. ఇప్పుడు తమిళంలోనూ రెండు సీరియల్స్‌లో నటిస్తున్నాను.

ప్రకటనల పూర్ణిక
ఆన్‌ స్క్రీన్‌ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేది. మా అమ్మ చిన్నాన్న సీనియర్‌ నటులు రంగనాథ్‌. అలా నాకూ నటన అంటే ఇష్టం ఏర్పడిందేమో అని అమ్మ అంటూ ఉంటుంది. చిన్నప్పటి నుంచీ టీవీలో వచ్చే యాడ్స్‌ని బాగా చూసేదాన్ని. వాటిల్లో యాక్ట్‌ చేయాలని నా డ్రీమ్‌. ఇప్పుడు యాడ్‌ఫిల్మ్‌లో నటిస్తూ నా కల నెరవేర్చుకుంటున్నాను.

ఇలా ఎంపికయ్యాను..
బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదివేటప్పుడు ఒక వెబ్‌సైట్‌లో మోడలింగ్‌ ఆడిషన్స్‌ ప్రకటన చూశాను. దాంట్లో నా పేరు రిజిస్టర్‌ చేయించుకున్నాను. ఇంట్లో ముందు అమ్మనాన్న వద్దన్నారు. ఆ ఆడిషన్స్‌ జరిగే చోటు, వ్యక్తుల గురించి నా స్నేహితుల ద్వారా తెలుసుకొని అమ్మనాన్నలను ఒప్పించి ఆ ఆడిషన్స్‌కి వెళ్లి సెలక్ట్‌ అయ్యాను. అప్పటినుంచి చిన్నా పెద్ద యాడ్స్‌ చేస్తున్నాను.

ఫస్ట్‌ టైమ్‌ స్క్రీన్‌
బీటెక్‌ తర్వాత జాబ్‌ చేయడం ఇష్టం లేదు. యాక్టింగ్‌ ఫీల్డ్‌లో కొనసాగాలన్నది నా ఆశ. అమ్మనాన్నలకు మాత్రం పెళ్లి చేసేద్దామని ఆలోచన. ఈ లోగా వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలన్నది నా తపన. మోడల్‌గా, నటిగా ఎలా ఉంటానో అని ముందు భయపడినా ఫస్ట్‌ టైమ్‌ స్క్రీన్‌ మీద చూసినప్పుడు నా మీద నాకు కాన్ఫిడెంట్‌ వచ్చింది. దీంతో ఈ ఫీల్డ్‌ వద్దని చెప్పిన అమ్మనాన్నలు కూడా నా మీద నమ్మకంతో ఓకే చేశారు. నా స్నేహితులు కూడా నాకు సపోర్ట్‌గా ఉన్నారు.

నార్త్‌ ఇండియన్‌ లుక్‌
మోడలింగ్‌లో బాంబే మోడల్స్‌నే ఎంపికచేస్తారు అనే అభిప్రాయం ఉంది ఇన్నాళ్లూ. కానీ, స్క్రీన్‌ అప్పియరెన్స్‌ బాగుంటే తెలుగమ్మాయిలు కూడా మోడలింగ్‌లో రాణించవచ్చు. అలా రాణిస్తున్నవాళ్లూ ఉన్నారు. నేను చేసిన మోడల్‌గా చేసిన యాడ్‌ చూసిన వాళ్ల ద్వారా ఇప్పుడు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. నార్త్‌ ఇండియన్‌ లుక్‌ ఉండటం కూడా మోడలింగ్‌లో కొంచెం ప్లస్‌ అయ్యింది.

ఫిట్‌నెస్‌ తప్పనిసరి
ఈ ఫీల్డ్‌లో పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు ఉన్నవాళ్లూ ఉన్నారు. అయితే, తప్పకుండా ఫిట్‌నెస్‌ బాగుండాలి. స్లిమ్‌ ఉండాలి. వర్కవుట్స్‌ చేస్తుండాలి. స్కిన్‌టోన్‌ ఫ్రెష్‌గా ఉండాలి. బాడీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నా నేచురల్‌గా ఉండాలనుకుంటాను. మోడలింగ్‌లో రాణిస్తూనే సీరియల్‌ నటిగా కొనసాగాలనుకుంటున్నాను.’’

– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top