నవంబర్ 8న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Today L. K. Advani Birhtday | Sakshi
Sakshi News home page

నవంబర్ 8న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Nov 8 2015 12:14 AM | Updated on Sep 3 2017 12:11 PM

నవంబర్ 8న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 8న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ఎల్.కె. అద్వానీ (రాజకీయ నేత)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించిన సంఖ్య. దీనివల్లన ధైర్యసాహసాలు, దేనినైనా ఎదుర్కోవాలన్న పట్టుదల, దృఢసంకల్పం ఉంటాయి. 9 అనేది న్యూమరాలజీలో అంతిమ సంఖ్య కాబట్టి వ్యాపారస్థులు కొత్తవాటి జోలికి పోకుండా పాతవాటినే కొనసాగించడం మంచిది. అలాగే గ్రీన్ కార్డ్ కోసం 2016 జులై తర్వాత ప్రయత్నించడం మంచిది. వివాహం, సంతాన ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

సొంత ఇంటి కల ఫలించే అవకాశం ఉంది. తొందరపాటును, కోపాన్ని తగ్గించుకోవడం. వాహనాలను, పదునైన ఆయుధాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం. వీరు పుట్టిన తేదీ 8 శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఒక గాడిన పడతాయి. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. సామాజిక పరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తాయి. నష్టాలలో ఉన్న వ్యాపారాలు, పరిశ్రమల వంటివి లాభాల బాట పడతాయి. పాతస్నేహాలు, పాత బంధుత్వాలు తిరిగి కలుస్తాయి.

లక్కీ నంబర్స్: 1,3,6,8, 9;
లక్కీ కలర్స్: సిల్వర్, బ్లాక్, పర్పుల్, రెడ్, గోల్డెన్, బ్లూ;
లక్కీ డేస్: ఆది, మంగళ, గురు, శుక్ర, శనివారాలు.

సూచనలు: అమ్మవారి ఆరాధన, వికలాంగులకు సహాయం చేయడం, శనికి తైలాభిషేకం, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, రక్తదానం చేయడం లేదా రక్తదానాన్ని ప్రోత్సహించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement