ఆ రెండు గ్రహాలు.. ఆవాసయోగ్యాలే!

Those two planets are the habitats - Sakshi

పరి పరిశోధన 

ట్రాపిస్ట్‌–1... ఈమధ్యే సౌర కుటుంబానికి ఆవల గుర్తించిన గ్రహ వ్యవస్థ పేరు ఇది. ఏడు గ్రహాలతో కూడిన ట్రాపిస్ట్‌ –1లో కనీసం రెండు గ్రహాలపై ఆవాసయోగ్యమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు అమీ బార్‌ అనే శాస్త్రవేత్త. మొత్తం ఏడు గ్రహాలు కూడా కొంచెం అటు ఇటుగా భూమి సైజులోనే ఉండటం వల్ల ట్రాపిస్ట్‌ –1 పై శాస్త్రవేత్తలు అమితాసక్తిని చూపుతున్నారు. మిగిలిన గ్రహ వ్యవస్థలతో పోలిస్తే ట్రాపిస్ట్‌–1 చాలా పాతది.

అంతేకాకుండా సాపేక్షంగా సగటు ఉష్ణోగ్రతలూ తక్కువే. అందుకే ఈ గ్రహ వ్యవస్థలో ఆవాసయోగ్యమైనవి ఉండే అవకాశాలు ఎక్కువన్న అంచనాతో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. మొత్తం గ్రహాలను బి, సి, డి, ఇ, ఎఫ్, జి. హెచ్‌... అనుకుంటే డి, ఇ లు రెండూ ఆవాసయోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోందని బార్‌ చెబుతున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top