ఎనిమిది నెలలు... ఇరవై కిలోలు! | The world's most weighty Baby | Sakshi
Sakshi News home page

ఎనిమిది నెలలు... ఇరవై కిలోలు!

May 11 2014 11:49 PM | Updated on Sep 2 2017 7:14 AM

ఎనిమిది నెలలు... ఇరవై కిలోలు!

ఎనిమిది నెలలు... ఇరవై కిలోలు!

పెద్ద పెద్ద బుగ్గలతో ఉన్న ఈ బాలభీముడిని చూశారా? తన తల్లి చేసిన తప్పిదం కారణంగా ఈ చిన్నారి బాబు కష్టాలు పడుతున్నాడు.

 పెద్ద పెద్ద బుగ్గలతో ఉన్న ఈ బాలభీముడిని చూశారా? తన తల్లి చేసిన తప్పిదం కారణంగా ఈ చిన్నారి బాబు కష్టాలు పడుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత బరువైన బేబీగా రికార్డు సృష్టించిన ఈ పిల్లవాడి పేరు శాంటియాగో మెండోజా. వయసు 8 నెలలు. బరువు దాదాపు 20 కిలోలు.
 
బ్రిటన్‌కు చెందిన శాంటియాగో ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడి బరువును తగ్గించడానికి వైద్యులు తంటాలు పడుతున్నారు. లేకలేక పుట్టిన శాంటియాగో అంటే అతడి తల్లి యూనిస్‌కి పిచ్చి ప్రేమ. దాంతో కాస్త ఏడ్చినా తట్టుకోలేక పోయేదట. ఏడుపు ఆపడానికి వెంటనే పాలు పట్టడమో, ఉడికించిన బంగాళదుంప, కోడిగుడ్లు, బిస్కెట్లు లాంటివి పెట్టేసేదట. దాంతో ఇలా అయిపోయాడు శాంటియాగో. వెంటనే బాబు బరువును తగ్గించకపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు చెప్పడంతో... ‘ఇదంతా నా తప్పు వల్లే జరిగింది, నా బాబును కాపాడండి, మీరేం చెబితే అదే చేస్తాను’ అంటూ వేడుకుంటోందట యూనిస్. బిడ్డమీద ప్రేమ ఉండొచ్చు కానీ, వారిని ప్రమాదంలో పడేసేంత ఉండకూడదని ఆమెకిప్పటికి తెలిసివచ్చింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement