కొత్త సరుకు | The new cargo | Sakshi
Sakshi News home page

కొత్త సరుకు

Jul 23 2014 11:39 PM | Updated on Nov 6 2018 5:26 PM

కొత్త సరుకు - Sakshi

కొత్త సరుకు

ఎల్‌జీ కంపెనీ తన జీ3 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.5 ఇంచెస్ ఎల్‌సీడీ క్యూహెచ్‌డీ డిస్‌ప్లేతో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ వెర్షన్‌పై పనిచేస్తుంది.

ఇండియాలోకి ఎల్‌జీ జీ3

ఎల్‌జీ కంపెనీ తన జీ3  స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 5.5 ఇంచెస్ ఎల్‌సీడీ క్యూహెచ్‌డీ డిస్‌ప్లేతో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ వెర్షన్‌పై పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 16 జీబీతో ఉండే స్మార్ట్‌ఫోన్ ధర 47,990 కాగా, 3జీబీ ర్యామ్‌తో 32 జీబీతో ఉండే స్మార్ట్‌ఫోన్ ధర రూ.50,990.
 
అత్యంత తేలికగా ‘లావా ఐరిస్ ప్రో 30’

కేవలం 114 గ్రాముల బరువుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది లావా. ఐరిస్ ప్రో 30 పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఫోన్‌ను ఆల్ట్రా లగ్జరియస్ స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొంది. ఇది నమ్మలేనంత తేలికగా ఉంటుందని రివ్యూల్లో పేర్కొన్నారు. యూత్ లక్ష్యంగా రూపొందిన ఈ మిడ్‌రేంజ్ ఫోన్ ధర రూ.15,999.
 

Advertisement
 
Advertisement
Advertisement