ఆస్ప్రిన్‌తో ఉపయోగం అంతంతే..

Study Says Aspirin Not Good For Elderly People - Sakshi

లండన్‌ : గుండె పోటుకు గురైన వారిలో రక్తాన్ని పలుచన చేసే ఆస్ర్పిన్‌ మాత్ర ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలినా, 70 ఏళ్లు పైబడినవారిలో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వడం లేదని, దీన్ని వాడటం ద్వారా శరీరంలోపల బ్లీడింగ్‌కు దారితీస్తోందని తాజా అథ్యయనం పేర్కొంది.  ఆస్ర్పిన్‌ పర్యవసానాలపై అమెరికా, ఆస్ర్టేలియాలో 70 ఏళ్లు పైబడిన 19,114 మందిపై ఐదేళ్ల పాటు అథ్యయనం చేపట్టారు. వీరిలో సగం మందికి రోజూ తక్కువ మోతాదులో ఆస్ర్పిన్‌ ఇవ్వగా వారిలో గుండె సమస్యలను తగ్గించడం, లేదా ఇతర ప్రయోజనం ఏమీ కనిపించలేదని గుర్తించారు.

ఆస్ర్పిన్‌ను అధికంగా తీసుకున్నవారిలో మాత్రం పొత్తికడుపులో బ్లీడింగ్‌ వంటి సమస్యలను గుర్తించామని పరిశోధకులు తెలిపారు. ఆరోగ్యవంతులైన వయోవృద్ధులకు ఆస్ర్పిన్‌తో ఎలాంటి అదనపు ప్రయోజనాలు చేకూరవని దీర్ఘకాలం వీటిని వాడటం వల్ల ఎలాంటి ఫలితం ఉండబోదని గుర్తించామని మొనాష్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జాన్‌ మెక్నీల్‌ తెలిపారు.

వైద్యుల సలహా లేకుండా తమకు తాముగా ఆస్ర్పిన్‌ తీసుకోవడం సరైంది కాదని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పీటర్‌ రూత్‌వెల్‌ హెచ్చరించారు. అయితే గుండెపోటు, స్ర్టోక్‌కు గురైన వారు ఆస్ర్పిన్‌ తీసుకోవడానికి అథ్యయన ఫలితాలు వర్తించవని పరిశోధకులు స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా తక్కువ మోతాదులో ఆస్ర్పిన్‌ను తీసుకుంటున్నవారు ఒక్కసారిగా దీన్ని నిలిపివేస్తే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, వైద్యుల సూచనతోనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top