స్నాప్‌డీల్... ఆల్ఫా ఫెదర్ | Snapdil ... Alpha Feather | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్... ఆల్ఫా ఫెదర్

Jul 2 2014 11:54 PM | Updated on Nov 6 2018 5:26 PM

స్నాప్‌డీల్... ఆల్ఫా ఫెదర్ - Sakshi

స్నాప్‌డీల్... ఆల్ఫా ఫెదర్

ప్రముఖ ఇంటర్నెట్ షాపింగ్ పోర్టల్ స్నాప్‌డీల్ తాజాగా ఆల్ఫా ఫెదర్ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటే క్లిక్ ప్రో పేరుతో ఓ స్పోర్ట్స్ కెమెరాను కూడా పరిచయం చేసింది.

ప్రముఖ ఇంటర్నెట్ షాపింగ్ పోర్టల్ స్నాప్‌డీల్ తాజాగా ఆల్ఫా ఫెదర్ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటే క్లిక్ ప్రో పేరుతో ఓ స్పోర్ట్స్ కెమెరాను కూడా పరిచయం చేసింది. మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే లక్ష్యంతో స్నాప్‌డీల్ ఏర్పాటు చేసిన లాంచ్‌పాడ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ రెండు గాడ్జెట్స్ తయారవడం విశేషం.

ఆల్ఫా ఫెదర్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే... ఇది ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఐదంగుళాల స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ చెబుతోంది. కేవలం 125 గ్రాములు తూగే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ 1920 బై 1080... అంటే అత్యంత స్పష్టమైన చిత్రాలకు అవకాశమున్నట్లు లెక్క. ప్రాసెసర్ ఏ కంపెనీదో తెలియనప్పటికీ నాలుగు కోర్లు ఉంటాయని, 1.30 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఆల్ఫా ఫెదర్‌లో ర్యామ్ 2 జీబీ కాగా, మెమరీ 4 జీబీలు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 ఎంపీ కాగా, వీడియో కాలింగ్ కెమెరా 8 ఎంపీతో వస్తోంది. దాదాపు 2500 ఎంఏహెచ్ బ్యాటరీతో నాలుగు గంటల టాక్‌టైమ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ధర రూ.12,999. క్లిక్ ప్రో కెమెరా అకలస్ ప్లస్ స్పోర్ట్స్ హెచ్‌డీ డీవీ, అకలస్ వైఫై స్పోర్ట్స్ క్యామ్ పేర్లతో రెండు వెర్షన్లు ఉన్నాయి. మొదటిదాంట్లో 12 ఎంపీ సీమాస్ సెన్సర్, 1.5 అంగుళాల డిస్‌ప్లే, 4ఎక్స్ జూమ్, 30 మీటర్ల వరకూ అండర్‌వాటర్ రెసిస్టెన్స్ ఉండగా, వైఫై స్పోర్ట్ప్‌లో 5ఎంపీ సీమాస్ సెన్సర్ ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement