breaking news
internet shopping
-
టీసీఎస్ సోషల్ సాకర్
భలే ఆప్స్ ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు బ్రెజిల్లో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. లీగ్ దశ దాటి నాకౌట్‌కు చేరుకున్న ఈ టోర్నీ వివరాలు ఎలాగైనా తెలుసుకోవచ్చు. కానీ పోటీల సందర్భంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోని ఉత్సాహాన్ని, ఆసక్తికరమైన కామెంట్ల గురించి తెలుసుకోవాలంటే మాత్రం టీసీఎస్ సోషల్ సాకర్ అప్లికేషన్‌ను వాడాల్సిందే. ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ప్రేమికులు మ్యాచ్‌లపై ఎలాంటి కామెంట్లు చేశారు? వారి మూడ్స్ ఎలా ఉన్నాయి? అన్నది ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. హైటెక్ అల్గారిథమ్స్ సాయంతో రియల్‌టైమ్‌లో మ్యాచ్ అనాలసిస్ ఇవ్వడంతోపాటు ట్విట్టర్ డేటాను కూడా సేకరించి ఇస్తుంది ఈ అప్లికేషన్. అంతేకాకుండా సహచర ఫ్యాన్స్‌తో మాట్లాడేందుకు, అభిప్రాయాలు పంచుకునేందుకు వేదికగా నిలుస్తుంది. మీకిష్టమైన టీమ్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. లొకేషన్ ఆధారిత సెంటిమెంట్లను కూడా తెలుసుకోవచ్చు. ప్రతి టీంపై ఎవరు ఏమనుకుంటున్నారో కూడా ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఆండ్రాయిడ్‌తోపాటు ఆపిల్ ఐఓఎస్‌కూ అందుబాటులో ఉన్న ఈ సోషల్ సాకర్ అప్లికేషన్‌ను App Store/iOS: http://on.tcs.com/SocSociOS, Play Store/Android: http://on.tcs.com/SocSocAndroidలింక్‌ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
స్నాప్‌డీల్... ఆల్ఫా ఫెదర్
ప్రముఖ ఇంటర్నెట్ షాపింగ్ పోర్టల్ స్నాప్‌డీల్ తాజాగా ఆల్ఫా ఫెదర్ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటే క్లిక్ ప్రో పేరుతో ఓ స్పోర్ట్స్ కెమెరాను కూడా పరిచయం చేసింది. మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే లక్ష్యంతో స్నాప్‌డీల్ ఏర్పాటు చేసిన లాంచ్పాడ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ రెండు గాడ్జెట్స్ తయారవడం విశేషం. ఆల్ఫా ఫెదర్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే... ఇది ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఐదంగుళాల స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ చెబుతోంది. కేవలం 125 గ్రాములు తూగే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ 1920 బై 1080... అంటే అత్యంత స్పష్టమైన చిత్రాలకు అవకాశమున్నట్లు లెక్క. ప్రాసెసర్ ఏ కంపెనీదో తెలియనప్పటికీ నాలుగు కోర్లు ఉంటాయని, 1.30 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఆల్ఫా ఫెదర్లో ర్యామ్ 2 జీబీ కాగా, మెమరీ 4 జీబీలు. మైక్రోఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 ఎంపీ కాగా, వీడియో కాలింగ్ కెమెరా 8 ఎంపీతో వస్తోంది. దాదాపు 2500 ఎంఏహెచ్ బ్యాటరీతో నాలుగు గంటల టాక్‌టైమ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. ధర రూ.12,999. క్లిక్ ప్రో కెమెరా అకలస్ ప్లస్ స్పోర్ట్స్ హెచ్డీ డీవీ, అకలస్ వైఫై స్పోర్ట్స్ క్యామ్ పేర్లతో రెండు వెర్షన్లు ఉన్నాయి. మొదటిదాంట్లో 12 ఎంపీ సీమాస్ సెన్సర్, 1.5 అంగుళాల డిస్ప్లే, 4ఎక్స్ జూమ్, 30 మీటర్ల వరకూ అండర్‌వాటర్ రెసిస్టెన్స్ ఉండగా, వైఫై స్పోర్ట్ప్లో 5ఎంపీ సీమాస్ సెన్సర్ ఉంది.