ఇవే కనుక అలా ఉంటేనా!

runway. He is coming from a long distance - Sakshi

చెట్టు నీడ 

మండుటెండ, దానికితోడు  చాలా దూరం నుంచి నడిచి  వస్తుండటం వల్ల అతనికి అలసటగా అనిపించింది. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదాం అనుకున్నాడు అతనొక బాటసారి. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. 

దారిలో ఓ పక్కగా అతనికొక గుమ్మడిపాదు కనిపించింది. దాని నిండా ఇంతింతలావు గుమ్మడికాయలున్నాయి. వాటిని చూసి అతను ‘‘దేవుడు ఎంత పిచ్చివాడు? ఇక్కడెక్కడో అనామకంగా... బలహీనంగా పడి ఉన్న ఈ గుమ్మడి పాదుకు ఇంతింత పెద్ద కాయలు ఇచ్చాడు’’ అనుకున్నాడు.  తర్వాత ఇంకొంచెం దూరం నడిచాడు. అక్కడ అతనికొక మర్రిచెట్టు కనిపించింది. ఎంతో విశాలంగా, ఊడలు దిగి ఉన్న ఆ చెట్టుకు చిన్న చిన్న కాయలుండటం చూశాడు. ‘‘దేవుడు నిజంగానే ఉట్టి వెర్రివాడు, పైగా మూర్ఖుడు కూడా! లేకపోతే ఇంత పెద్ద చెట్టుకు అంత చిన్న కాయలా?’’ అనుకున్నాడు. మండుటెండ, దానికితోడు చాలా దూరం నుంచి నడిచి వస్తుండటం వల్ల అతనికి అలసటగా అనిపించింది. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదాం అనుకున్నాడు. దగ్గరున్న సంచిలోనుంచి వెంట తెచ్చుకున్న తినుబండారాలను తిన్నాడు. తలకు చుట్టుకుని ఉన్న కండువాను విప్పి, చెట్టుకింద పరిచాడు. నీడలో పడుకున్నాడు. నిద్ర ముంచుకొచ్చింది. హాయిగా పడుకున్నాడు.

కాసేపయ్యాక లేచాడు. తన మీద, పక్కన పడి ఉన్న మర్రికాయలను చూశాడు.  ‘‘ఇంకా నయం, ఈ కాయలు చిన్నవి కాబట్టి, మీద పడినా నాకేమీ కాలేదు. అదేగనక ఆ గుమ్మడికాయల పరిమాణంలో ఉండి ఉంటే ... అవి గనక నా మీద పడి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో... నిజంగా దేవుడు ఎంత దయామయుడు... ఎంత ఆలోచనాపరుడు!’’అనుకుని, మనసులోనే దేవుడికి వెయ్యి దణ్ణాలు పెట్టుకుని లేచి అక్కyì  నుంచి వెళ్లిపోయాడు.  పట్టించుకుంటే... పట్టి పట్టి చూస్తే ప్రతిదీ లోపంగానే కనిపిస్తుంది. కాస్త ఆలోచించి, నిదానించి చూస్తే గానీ తెలియదు, మర్మం ఏమిటో.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top