సాగరమే సంతస నిలయం | Research | Sakshi
Sakshi News home page

సాగరమే సంతస నిలయం

Sep 16 2015 5:00 AM | Updated on Sep 3 2019 8:56 PM

పనీపాటాలేని తీరికవేళలో ఊరంతా షికారుగా చక్కర్లు కొడితే మిగిలేవి విసుగు, అలసట మాత్రమే

పరిపరి  శోధన

పనీపాటాలేని తీరికవేళలో ఊరంతా షికారుగా చక్కర్లు కొడితే మిగిలేవి విసుగు, అలసట మాత్రమే. సినిమాకో, బారుకో వెళ్లినా హ్యాపీనెస్‌కు నో గ్యారంటీ! అయితే, సముద్ర తీరంలో కాసేపు గడిపితే మాత్రం సంతోషం ఫ్రీ అని ప్లైమత్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. తీరికవేళల్లో సంతోషంగా గడపాలంటే సముద్రతీరానికి మించిన ప్రదేశాలే లేవని వారు తమ అధ్యయనం సాక్షిగా వెల్లడిస్తున్నారు. వివిధ ప్రదేశాల్లో తీరిక సమయాలను గడిపిన వారిపై విస్తృత పరిశోధన చేసి మరీ ఈ నిర్ణయానికి వచ్చామని, సముద్రతీరంలో సేదతీరితే వచ్చే సంతోషమే వేరని అంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement