తేనెపట్టులా నీ పలుకే..

Pooja Hegde Reveals Unknown Facts About Her Entry in DJ - Sakshi

‘ముకుంద’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మహర్షి’... సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజా హెగ్డే అంతరంగాలు...

రీచార్జ్‌
‘ఫలనా వ్యక్తిలా నేనెందుకు ఉండకూడదు!’ అని ఎప్పుడూ ఆలోచించలేదు.‘నేను నాలాగే ఉండాలి’ అనేది నా విధానం. అలా ఉంటేనే సౌకర్యంగా ఉంటాను. ప్రజలతో కలిసిపోవడం, ప్రయాణాలు చేయడం, పుస్తకాలు చదవడం ద్వారా నన్ను నేను రీచార్జ్‌  చేసుకుంటాను.

పరకాయప్రవేశం
కొన్నిసార్లు అదృష్టవశాత్తు మన స్వభావానికి అద్దం పట్టే పాత్రలు వస్తాయి. అప్పుడు అవలీలగా చేసేయవచ్చు. కొన్నిసార్లు మాత్రం మన స్వభావానికి విరుద్ధమైన పాత్రలు వస్తాయి. అది ఒకరకంగా సవాలే! ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో ఔట్‌గోయింగ్, మోడర్న్‌ కారెక్టర్‌ చేశాను. నిజానికి నిజ జీవితంలో నేను రిజర్వ్‌డ్‌గా ఉంటాను. సిగ్గరిని కూడా. అయినప్పటికీ ‘డిజే’లో ఆ క్యారెక్టర్‌లోకి పరకాయప్రవేశం చేశాను. ఇక్కడ ఒక విషయం పంచుకోవాలి... నేను మోడర్న్‌ కాకపోవచ్చుగానీ... నా ఆలోచనలు మాత్రం మోడర్న్‌గానే ఉంటాయి.

కొత్త కొత్తగా...
షూటింగ్‌లేని సమయాల్లో ఖాళీగా కూర్చోవడం కంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. మా బ్రదర్‌ నుంచి గిటార్‌ ప్లే చేయడం నేర్చుకుంటున్నాను. పాటలు కూడా పాడుతాను. అయితే  ఇంకా ప్రావీణ్యం రావాలి.‘‘ఒకేసారి అన్ని పాటలు పాడాలనుకోకు, ఒక పాట పర్‌ఫెక్ట్‌గా నేర్చుకున్న తరువాతే రెండో పాట గురించి ఆలోచించు’’ అని బ్రదర్‌ సలహా ఇచ్చాడు. ప్రస్తుతానికి మాత్రం ‘పాపా కెòహెతే’ పాట బాగా పాడగలను. ఈ సంగతి ఎలా ఉన్నా... పాటల మీద ఉన్న ఇష్టం వల్ల సంగీతకారులపై ప్రత్యేక గౌరవం పెరిగింది.

అదృష్టం
విధిరాతను నమ్ముతాను. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలి అనేది ముందే డిజైనై ఉంటుందని నా నమ్మకం. టీనేజ్‌లో బక్కపలచగా ఉండేదాన్ని. నేను సినిమాల్లో నటిస్తానని ఎవరూ అనుకోలేదు. సినిమా ఫీల్డ్‌లోకి వెళ్లాలని నేనూ ఎప్పుడూ అనుకోలేదు. ఇది మాత్రమే కాదు ‘భవిష్యత్‌లో ఇది చేయాలి’ అని ఎప్పుడూ అనుకోలేదు. విధివశాత్తు సినిమా ప్రొఫెషన్‌లోకి వచ్చాను. ఇది అదృష్టంగా భావిస్తున్నాను. ‘మా అమ్మాయి కాబట్టి ఎలా చేసినా ప్రశంసించాలి’ అనే దృష్టితో కాకుండా మా పేరెంట్స్‌ కరెక్ట్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇస్తారు. దీవివల్ల తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకుంటాను. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top