భావన కెరీర్‌తో ఆడుకుంటున్నాడా? | paly with with the bhavana of career? | Sakshi
Sakshi News home page

భావన కెరీర్‌తో ఆడుకుంటున్నాడా?

Dec 25 2015 11:12 PM | Updated on Sep 28 2018 4:15 PM

భావన కెరీర్‌తో  ఆడుకుంటున్నాడా? - Sakshi

భావన కెరీర్‌తో ఆడుకుంటున్నాడా?

ఒంటరి, హీరో, మహాత్మ.. ఇలా తెలుగులో చేసినవి తక్కువ చిత్రాలే అయినా భావన మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఒంటరి, హీరో, మహాత్మ.. ఇలా తెలుగులో చేసినవి తక్కువ చిత్రాలే అయినా భావన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మలయాళ బ్యూటీ తన మాతృభాషతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మలయాళంలో ఓ హీరో కారణంగా ఆమె కెరీర్ ఇరుకుల్లో పడిందని సమాచారం. ఆ హీరో పేరు దిలీప్. ఇతగాడు భావనకు అవకాశాలు రానీయకుండా చేస్తున్నాడని వినికిడి. దిలీప్, ఆయన భార్య, నటి మంజూ వారియర్ విడాకులు తీసుకున్నారు.

ఆ సమయంలో మంజూ వారియర్‌ను భావన సపోర్ట్ చేసిందట. దానివల్ల భావనపై దిలీప్ ఆగ్రహం చెందాడని, తనకు అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నాడని మలయాళ పరిశ్రమలో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఒకవేళ భావన కనుక నటీనటుల సంఘానికి ఈ విషయం గురించి ఫిర్యాదు చేస్తే, అప్పుడు దిలీప్ తగిన చర్య తీసుకోవాలనుకుంటున్నారట. మరి.. నిజంగానే భావనకు అవకాశాలు రాకుండా దిలీప్ గేమ్ ప్లే చేస్తున్నారా? అదే నిజమైతే భావన నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేస్తారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement