సెప్టెంబర్ 14న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On September 14, the birthday celebration is buying Celebrities | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 14న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Sep 13 2015 11:22 PM | Updated on Sep 3 2017 9:20 AM

సెప్టెంబర్  14న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

సెప్టెంబర్ 14న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 4.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
మాధవి (నటి), రాబిన్ సింగ్ (మాజీ క్రికెటర్)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 4. ఇది రాహుసంఖ్య కావడం వల్ల వీరు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొంటారు. వారసత్వపు ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. కోర్టుకేసుల నుండి విముక్తి లభిస్తుంది. వివాదాలలో చిక్కుకున్న ఆస్తులను గెలుచుకుంటారు. అయితే రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ సంవత్సరం న్యాయసంబంధమైన, చట్టసంబంధమైన వివాదాలలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడటం మంచిది. పుట్టిన తేదీ 14. ఇది బుధసంఖ్య కావడం వలన చేసే పనిలో నైపు ణ్యం చూపిస్తారు. విదేశీయానం చేస్తారు. రాజకీయ నాయకులకు గౌరవమర్యాదలు, పదవులు లభిస్తాయి. గ్రీన్‌కార్డ్ లేదా స్థిరనివాసం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి.


మేనేజ్‌మెంట్ రంగంలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లకు, ఫైనాన్స్ రంగ ంలోని వారికి కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగా పుంజుకుంటారు. లక్కీ నంబర్లు: 1, 4,5,6,8; లక్కీ కలర్స్: పర్పుల్, బ్లూ, వయోలెట్, గ్రీన్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని, ఆది, సోమ వారాలు. సూచనలు: కోపాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Advertisement
 
Advertisement
Advertisement