అక్టోబర్ 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On October 3 to celebrate the birthdays of celebrities carry forward | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Oct 2 2015 11:50 PM | Updated on Sep 3 2017 10:21 AM

అక్టోబర్  3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

అక్టోబర్ 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
జె.పి.దత్తా (దర్శకుడు, నిర్మాత), సత్యరాజ్ (నటుడు)

 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య. వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎంతో చాకచక్యంగా విజయాలు సాధించి, కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యంతో ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. మధురంగా మాట్లాడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. వీరు పుట్టినతేదీ 3.

ఇది కూడా గురు సంఖ్యే. దీనివల్ల వీరు విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కొత్తస్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడతాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు పొందుతారు. జ్యోతిష్యులు,వేదపండితులు గుర్తింపు పొందుతారు. లక్కీనంబర్స్: 1,2,3; లక్కీ కలర్స్: క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు.
 
సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం, పండితులను, మతగురువులను గౌరవించడం, అనాథలను ఆదరించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement