breaking news
JP Dutta
-
జవాన్ల కోసం తెరుచుకున్న ‘హెవెన్’..!
కశ్మీర్ : భారత జవాన్లు రిలీఫ్ అయ్యేందుకు 30 ఏళ్ల క్రితం మూతబడిన హెవెన్ థియేటర్ తెరచుకుంది. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ థియేటర్ ఉంది. పుల్వామా ఘటన తర్వాత అక్కడ బందోబస్తు పెరిగిపోవడంతో సైనికులు సేద తీరేందుకు ఈ థియేటర్ని ఉపయోగంలోకి తెచ్చారని స్థానికంగా నివాసముండే హవల్దార్ రామ్జీ చెప్పారు. రేయింబళ్లు డ్యూటీలో మునిగిపోయే జవాన్లు హెవెన్లో కాసేపు సినిమా చూసి రిఫ్రెష్ అవుతున్నారని తెలిపారు. యుద్ధం నేపథ్యంలో సాగే ‘పల్టాన్’ లాంటి సినిమాలు మరింత ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. కన్నవారిని, భార్యబిడ్డలకు దూరంగా ఉంటున్న జవాన్లకు బాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కే జేపీ దత్తా సినిమాలు కాస్త ఉత్సాహాన్నిస్తాయన్నారు. స్థానికులతో పాటు సినిమా చూడడం కొత్త అనుభూతినిస్తోందని సీఆర్పీఎఫ్ 40 బెటాలియన్ కమాండెంట్ అశు శుక్లా చెప్పారు. అమితాబ్ బచ్చన్ నటించిన కాళియా 1991లో హెవెన్లో ఆడిన చివరి సినిమా. -
అక్టోబర్ 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: జె.పి.దత్తా (దర్శకుడు, నిర్మాత), సత్యరాజ్ (నటుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య. వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎంతో చాకచక్యంగా విజయాలు సాధించి, కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యంతో ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. మధురంగా మాట్లాడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. వీరు పుట్టినతేదీ 3. ఇది కూడా గురు సంఖ్యే. దీనివల్ల వీరు విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కొత్తస్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడతాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు పొందుతారు. జ్యోతిష్యులు,వేదపండితులు గుర్తింపు పొందుతారు. లక్కీనంబర్స్: 1,2,3; లక్కీ కలర్స్: క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు. సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం, పండితులను, మతగురువులను గౌరవించడం, అనాథలను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్