అక్టోబర్ 16న ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On October 16, the birthday celebration with you today, Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 16న ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Oct 15 2015 11:38 PM | Updated on Sep 3 2017 11:01 AM

అక్టోబర్  16న ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 16న ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
హేమామాలిని (నటి), పృథ్వీరాజ్ (నటుడు)
 

 ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. పుట్టిన తేదీ 16. ఇది కేతు సంఖ్య కావడం వల్ల వీరిపై ఈ సంవత్సరమంతా కేతుగ్రహప్రభావం బలంగా ఉంటుంది. దీనివల్ల ప్రాపంచిక జీవితంపైన కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ ఏర్పడుతుంది. ఆధ్యాత్మికోన్నతి సాధిస్తారు. మాటకు విలువ ఏర్పడుతుంది. అందరూ గౌరవిస్తారు. వేదపండితులు, జ్యోతిష్యులు, తాంత్రిక విద్యలలో ప్రవేశం ఉన్న వారికి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతానప్రాప్తి కలుగుతుంది. కేతుగ్రహ ప్రభావం వల్ల వీరు ఈ సంవత్సరమంతా ఆధ్యాత్మిక చింతన, తాత్వికత, అతీంద్రియ శక్తులను నేర్చుకోవడం వంటి వాటిపై మొగ్గు చూపుతారు.

పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులకు విదేశాలలో చదువుకోవాలనే కోరిక, ఉద్యోగులకు విదేశాలలో ఉద్యోగాలు చేయాలనే కోరిక తీరతాయి. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. వైద్యవిద్యార్థులకు, వైద్యులకు బాగా పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, శాండల్ , బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, శుక్రవారాలు.

సూచనలు: భూమిని, ఇంటిని అమ్మాలనే ఆలోచనను విరమించుకోవడం మంచిది. సంసార జీవనం పట్ల దృష్టి సారించడం, కేతు గ్రహ జపం చేయించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, పండితులను, గురువులను గౌరవించడం, వికలాంగులను ఆదరించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement