నవంబర్ 25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On November 25, the birthday of celebrities | Sakshi
Sakshi News home page

నవంబర్ 25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Nov 24 2015 10:19 PM | Updated on Sep 3 2017 12:57 PM

నవంబర్  25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 25న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
రూపా గంగూలీ (నటి), రాఖీ సావంత్ (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది వృత్తికారకుడైన శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరత్వాన్ని, అభివృద్ధిని సాధిస్తారు. సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల ఉంటుంది. వీరు ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లలకు వివాహాది శుభకార్యాలు జరిపిస్తారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు, మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. పుట్టిన తేదీ 25. ఇది కేతు సంఖ్య కావడం వల్ల దైవకృపతో నీతి నిజాయితీలతో పని చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. యోగ, ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా మంచి మార్పు వస్తుంది. ఎప్పటినుంచో వాయిదా పడుతున్న పుణ్యక్షేత్ర సందర్శన ఈ సంవత్సర తప్పక చేస్తారు. అయితే బీపీ, గుండె సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశం ఉండటం వల్ల యోగ, మెడిటేషన్ చేస్తూ వైద్య సలహాలు తీసుకుంటూ ఉండటం మంచిది.

లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, గ్రే, క్రీమ్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు.
 సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం, కాకులకు, కోతులకు ఆహారం పెట్టడం, మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం,పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం మంచిది.

 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement