నవంబర్ 22న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | on november 20 the birthday of celebrities | Sakshi
Sakshi News home page

నవంబర్ 22న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Nov 21 2015 11:31 PM | Updated on Sep 3 2017 12:49 PM

నవంబర్ 22న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 22న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల...

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: ములాయం సింగ్ యాదవ్ (రాజకీయ నాయకుడు)
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యంతో పెండింగ్ పనులను చకచకా పూర్తి చేయగలుగుతారు.  విద్యార్థులకు కోరుకున్న ఇన్‌స్టిట్యూట్లలో కోరుకున్న కోర్సులలో సీట్లు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారం నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేస్తారు.

ఆర్థిక భద్రత, స్నేహసంబంధాలు పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. పుట్టిన తేదీ 22. ఇది రాహు సంఖ్య కావడం వల్ల స్నేహితులతో, అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. విదేశీవిద్య, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రీన్‌కార్డ్ ఈ సంవత్సరం కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి.
 
లక్కీ నంబర్స్: 2,3,4,5,6; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, వైట్, గ్రీన్, బ్లూ, రెడ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్ర, శనివారాలు. సూచనలు: నవగ్రహాభిషేకం, రాహుజపం చేయించడం, పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం, గురువులు, వేదపండితులు, పాష్టర్లు, కాజీలను గౌరవించడం, దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement
 
Advertisement
Advertisement