నవంబర్ 11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On November 11, the birthday of celebrities | Sakshi
Sakshi News home page

నవంబర్ 11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Nov 10 2015 11:15 PM | Updated on Sep 3 2017 12:20 PM

నవంబర్  11న  పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతి సంఖ్య కావడం వల్ల నిశిత పరిశీలన, కుశాగ్రబుద్ధి,

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
డికాప్రియో (హాలీవుడ్ నటుడు), రాబిన్ ఉతప్ప (క్రికెటర్)

 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతి సంఖ్య కావడం వల్ల నిశిత పరిశీలన, కుశాగ్రబుద్ధి, సృజనాత్మకత కలిగి ఉండి, మేధావిగా గుర్తింపబడతారు. ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మంచి పనిమంతులుగా పేరుతెచ్చుకుంటారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి.  కొత్త కొత్త కోర్సులు చేస్తారు. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. వీరు పుట్టిన తేదీ 11. ఇది న్యూమరాలజీలో మాస్టర్ నంబర్. దీని వల్ల ఊహాశక్తి, ఆదర్శభావాలు, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు స్వతఃసిద్ధంగా అబ్బుతాయి. సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు.

గత సంవత్సరం చేపట్టిన ప్రాజెక్టులు, ప్రణాళికలనుంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో పనులను చురుకుగా చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే నేత్రవ్యాధులు, హృద్రోగాలు, మానసిక అస్థిరత ఉండే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,3, 5,6,7; లక్కీ కలర్స్: పర్పుల్, గ్ల్రే, ఎల్లో, బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement