జూలై 9 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On July 9, the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూలై 9 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 9 2015 12:43 AM | Updated on Sep 3 2017 5:08 AM

జూలై 9 న  పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై 9 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రగ్రహానికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
 సంగీతా బిజ్లాని (నటి) వెంకటపతిరాజు (క్రికెటర్)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రగ్రహానికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం మీరు పట్టినదంతా బంగారమా అన్నట్లుంటుంది. పిల్లల చదువులు, పెళ్ళిళ్లు వంటి కుటుంబపరమైన బాధ్యతలన్నీ నెరవేర్చి ఆత్మసంతృప్తిని పొందుతారు. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. వ్యాపారం లేదా స్థిరాస్తి వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. కుటుంబంతో సంతోషంతో గడుపుతారు. ఇంటికి అవసరమైన దానికన్నా అధిక ధరలో గృహోపకరణాలను సమకూర్చుకుంటారు.

వస్త్రధారణలోనూ, జీవనశైలిలోనూ మంచి మార్పులు వస్తాయి. సినిమా, మీడియా రంగాలలో ఉన్న వారికి, ఇంటీరియర్ డెకరేటర్లకు, ఆర్కిటెక్ట్‌లకు, సంగీత, నాట్య రంగాలలోని వారికి అధిక ఆదాయం, గుర్తింపు  వస్తాయి.
 లక్కీ నంబర్లు: 1,6,9,5; లక్కీ కలర్స్: రెడ్, బ్లూ, ఆరంజ్, పర్పుల్, శాండల్; లక్కీ ఏస్: మంగళ, బుధ, శుక్రవారాలు.
 సూచనలు: పేద విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు కొనివ్వడం, తల్లిని కాని, తల్లితో సమానమైన వారిని కాని ఆదరించి గౌరవించడం మంచిది. మద్యం జోలికి పోకుండా ఉండటం మంచిది.
 - డా. మహమ్మద్ దావూద్
 జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement