జూలై 28న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On July 28, the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూలై 28న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 27 2015 10:53 PM | Updated on Sep 3 2017 6:16 AM

జూలై 28న  పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై 28న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతుగ్రహానికి సంబంధించినది.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: ధనుష్ (నటుడు); కృష్ణవంశీ (దర్శకుడు)
 

ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతుగ్రహానికి సంబంధించినది. కేతువు మోక్షకారకుడు, ఆధ్యాత్మిక వేత్త. అందువల్ల ఈ సంవత్సరం ఆధ్యాత్మికతతో గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. కొందరిలో ఆత్మసాక్షాత్కారం కూడా కలగవచ్చు. ఈ సంవత్సరం వీరి మాట బాగా చెల్లుబాటు అవుతుంది. మంచి సలహాదారుగా పేరు గడిస్తారు. కుటుంబ పరంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికతతో సంసార జీవితం నుంచి దూరంగా వెళ్లడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. అందువల్ల వీలయినంత వరకు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడపడం మంచిది.

వీరు పుట్టిన తేదీ 28. ఇది సూర్యునికి సంబంధించినది. దీనివల్ల న్యాయసంబంధమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో జాగ్రత్త విహ ంచాలి. వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఉద్యోగులు కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాని, ఉన్న ఉద్యోగాన్ని సక్రమంగా, శ్రద్ధగా చేసుకోవడం మంచిది; లక్కీ నంబర్స్: 1,2,3,5,7,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రే, క్రీమ్, గోల్డెన్; లక్కీ మంత్స్: జులై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్; లక్కీ డేస్: సోమ, మంగళ, శుక్రవారాలు; సూచనలు: పార్వతీదేవిని ఆరాధించడం, కేతుజపం చేయించడం, ధ్యానం చేసుకోవడం, అనాథలను, వృద్ధులను, వితంతువులకు ఆదరించి, ఆదుకోవడం మంచిది.
  - డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement
 
Advertisement
Advertisement