జూలై 23న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On July 23, the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూలై 23న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 22 2015 10:33 PM | Updated on Sep 3 2017 5:58 AM

జూలై  23న  పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై 23న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 2.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
సూర్య (నటుడు), హిమేష్ రేషమియా (గాయకుడు)  

 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించినది. పుట్టిన తేదీ 23. ఇది బుధునికి సంబంధించినది కావడం వల్ల మంచి తెలివితేటలు, మంచి సమయస్ఫూర్తి కలవారవుతారు. మీకు ఎల్లప్పుడూ ప్రభుత్వ పరమైన సహకారం, ప్రభుత్వోద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా గడుపుతారు. సౌందర్యంపైన, అలంకరణపైన దృష్టి పెడతారు. సృజనాత్మకంగా పని చేస్తారు. మీ తెలివి తేటలతో అందాన్ని ఇనుమడింప చేసుకుంటారు. సంఘంలో గౌరవం, పేరుప్రఖ్యాతులు పొందుతారు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. కాంపిటీటివ్ పరీక్షలలో విజయం లభిస్తుంది.

లక్కీ నంబర్స్: 1,2,5,6,7; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, సిల్వర్, బ్లూ, పర్పుల్; లక్కీ డేస్: సోమ, బుధ, గురువారాలు; లక్కీ మంత్స్: ఫిబ్రవరి, మార్చి,జూన్, ఆగస్ట్.

సూచనలు: నరాలకు సంబంధించిన, మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల రాత్రివేళల్లో చంద్రకాంతి ఒంటికి తగిలేటట్లు గడుపుతూ ఉండండి. నవగ్రహారాధన చేయడం, తల్లిని, తత్సమానురాలైన వారిని ఆదరించడం. పేదలకు, అనాథలకు పాలు, బియ్యం, బెల్లంతో కూడిన పదార్థాలు తినిపించడం, ఆవులకు ఆహారం పెట్టడం మంచిది.
  - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

Advertisement
 
Advertisement
Advertisement