జూలై13 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On July 13, the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూలై13 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jul 12 2015 10:48 PM | Updated on Sep 3 2017 5:23 AM

జూలై13 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై13 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: హ్యారిసన్  ఫోర్డ్ (హాలీవుడ్ నటుడు), మాస్టర్ సలీమ్ (బాలీవుడ్ గాయకుడు)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది రవికి సంబంధించినది కావడం వల్ల ఈ సంవత్సరం వీరి జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. కొత్త ఉత్సాహం, దేనినైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అనూహ్యంగా, అప్రయత్నంగా అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. కొత్త టెక్నాలజీ తెలుసుకుంటారు. మీ టెక్నాలజీని మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉపయోగించి, లాభపడతారు. అవివాహితులకు వివాహం అవుతుంది. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు పుట్టిన తేదీ 13 రాహువుకు సంబంధించినది కావడం వల్ల కంప్యూటర్ రంగంలోని వారికి, ఎం.బి.ఎ; సి.ఎ; ఎల్.ఎల్.బి చదివిన వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి.

పోటీపరీక్షల్లో విజయం ప్రాప్తిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి బాగా కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అయితే అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశంగా మాట్లాడటం వల్ల నష్టపోతారు. లక్కీ నంబర్స్: 1,4,5, 6; లక్కీ కలర్స్: వయోలెట్, క్రీమ్, గోల్డెన్, రెడ్, శాండల్; లక్కీ డేస్: శుక్ర, ఆది, సోమవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. దుర్గాదేవిని ఆరాధించడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం లేదా వినడం, పేదవితంతువులకు సాయం చేయడం, వీధికుక్కలకు రొట్టెలు తినిపించడం మంచిది.
 - డాక్టర్ ముహ్మద్ దావూద్
 
 

Advertisement
 
Advertisement
Advertisement