ఆలివ్‌నూనెతో మధుమేహానికి అడ్డుకట్ట | Olive Oil Reduces the Risk of Type 2 Diabetes | Sakshi
Sakshi News home page

ఆలివ్‌నూనెతో మధుమేహానికి అడ్డుకట్ట

Oct 21 2017 1:04 PM | Updated on Oct 21 2017 1:16 PM

 Olive Oil Reduces the Risk of Type 2 Diabetes

న్యూయార్క్ ‌: మధుమేహానికి ఆలివ్‌నూనె వాడటం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందులో ఉండే ‘ఒలెరోపిన్‌’ సమ్మేళనం ఎక్కువ ఇన్సులిన్‌ స్రవించేలా శరీరానికి సాయం చేసి, మధుమేహాన్ని అడ్డుకుట్టుందని అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ (వర్జీనియా టెక్‌) పరిశోధకులు తెలిపారు. ఆలివ్‌నూనెలో ఉండే ఆయుర్వేద గుణాలు రోగ క్రిమినాశకంగా పనిచేస్తాయని వెల్లడించారు. అలాగే వందలాది ఏళ్ల నుంచి మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో ఆలివ్‌ నూనెను వంటల్లో వినియోగిస్తున్నారు. వంటల్లో ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది.

అలాగే సౌందర్య సాధనంగా ఆలివ్‌ ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. మరో సింపుల్‌ టిప్‌ ఏంటంటే... రాత్రి పడుకునేముందు అరటిపండు గుజ్జులో ఆలివ్ ఆయిల్ కలిపి, ముఖానికి మసాజ్ చేసుకుంటే ముడతలు రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement