అక్టోబర్ 21న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | October 21 birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 21న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Oct 20 2015 11:59 PM | Updated on Sep 3 2017 11:15 AM

అక్టోబర్ 21న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

అక్టోబర్ 21న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. పుట్టినతేదీ 21.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: అశ్వనీ నాచప్ప (క్రీడాకారిణి, నటి), శరణ్ దీప్ సింగ్ (మాజీ క్రికెటర్)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. పుట్టినతేదీ 21. ఇది కూడా బృహస్పతికి చెందిన సంఖ్యే కావడం వల్ల వీరు బృహస్పతి ప్రభావంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. వీరిని విజయాలు వరిస్తాయి. కొత్త స్నేహాలు, కొత్తబంధుత్వాలు ఏర్పడి, వాటివల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులకు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది.

ఈ సంవత్సరమంతా సుఖసంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఇంటాబయటా మాటకు విలువ ఏర్పడుతుంది.  ఎంతో చాకచక్యంగా విజయాలు సాధించి, కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యంతో ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. మధురంగా మాట్లాడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు, వేదపండితులు గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను పొందుతారు.
 
లక్కీ నంబర్స్: 1,2,3; లక్కీ కలర్స్: క్రీమ్, గోల్డెన్, ఎల్లో, శాండిల్; లక్కీ డేస్: ఆది, సోమ, గురువారాలు.
 
సూచనలు: దక్షిణామూర్తి, సాయిబాబా, దత్తాత్రేయస్వామి వంటి గురుపరంపరకు చెందిన వారిని ఆరాధించడం, పండితులను, మతగురువులను గౌరవించడం, అనాథలను ఆదరించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్

Advertisement
 
Advertisement
Advertisement