అక్టోబర్ 20న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | October 20 birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 20న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Oct 20 2015 12:10 AM | Updated on Sep 3 2017 11:12 AM

అక్టోబర్ 20న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

అక్టోబర్ 20న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. వీరి పుట్టిన తేదీ 20.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: నవ్‌జోత్ సింగ్ సిద్ధు (మాజీ క్రికెటర్) వీరేందర్ సెహ్వాగ్ (క్రికెటర్)
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. వీరి పుట్టిన తేదీ 20. అంటే 2. ఈ రెండూ కూడా చంద్రునికి సంబంధించినవే కావడం వల్ల వీరు ఈ సంవత్సరం చంద్రుని ప్రభావం వల్ల ప్రాపంచిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగం, వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి.

పూర్వికుల ఆస్తులు అందిపుచ్చుకుంటారు. ధనానికి లోటుండదు. అయితే ఇతరులకు రుణాలు, హామీలు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. చంద్రప్రభావితమైన జాతకం కాబట్టి వీరి ఆలోచనలకు మంచి గుర్తింపు వస్తుంది. దీనివల్ల రాజకీయంగా ఎదుగుతారు లేదా మంచి సలహాదారుగా, మార్గదర్శకుడిగా మన్ననలు అందుకుంటారు. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, జ్యోతిష్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మంచి పేరు, ఆదాయం లభిస్తాయి.

లివర్‌కు, మనసుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. లక్కీనంబర్స్: 1,2,5,6,8; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, పర్పుల్, ఎల్లో, శాండిల్, క్రీమ్ లక్కీ డేస్: సోమ, బుధ, గురు, శుక్రవారాలు.  సూచనలు: ప్రార్థనలు పెట్టించడం, ఖురాన్ పఠనం చేయడం, మదరసాలు, వేదపాఠశాలలు, క్రైస్తవ మిషినరీలకు సహాయం చేయడం, చంద్రుని వెన్నెలలో గడపడం, అనాథలకు బెల్లం పాయసం తినిపించడం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్

Advertisement
 
Advertisement
Advertisement