అక్టోబర్ 17 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | October 17 birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 17 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Oct 16 2015 11:56 PM | Updated on Sep 3 2017 11:04 AM

అక్టోబర్  17  పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

అక్టోబర్ 17 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
 స్మితా పాటిల్ (నటి)     
అనిల్ కుంబ్లే  (మాజీ క్రికెటర్)      
ప్రణీత (నటి)

 
 ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది శని సంఖ్య. వీరు పుట్టిన తేదీ 17. ఇది కూడా  శనిసంఖ్య కావడం వల్ల వీరిపై శని ప్రభావం బలంగా ఉంటుంది. దీనిమూలంగా పనులు కొంచెం ఆలస్యంగా జరిగినప్పటికీ శని వృత్తి కారకుడు, ఆయుఃకారకుడు కావడం వల్ల ఆయా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉత్సాకరంగా నడుస్తాయి. తగిన ప్రోత్సాహం లభించడం వల్ల స్థిరత్వాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  న్యాయవాద వృత్తిలో ఉన్న వారు ఆర్థికంగా బలపడతారు. మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. సామాజికపరమైన ఉన్నతి, గుర్తింపు లభిస్తుంది.

విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. అవిశ్రాంతంగా పని చేయడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు,  ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల తోటివారితో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది. లక్కీ డేస్: 1,3,6, 8,9; లక్కీకలర్స్: ఎల్లో, గోల్డెన్, శాండిల్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించడం, కుక్కలకు ఆహారం  పెట్టడం,  వృద్ధులను ఆదరించడం, మాటలలో సంయమనం పాటించడం.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement