ఏ డ్రెస్‌ వేసుకోవాలో చెప్పే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్...

Not Sure What to Wear ? Let AI be Help - Sakshi

న్యూయార్క్‌: ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లేటపుడు ఏ డ్రెస్‌ వేసుకోవాలో అర్థం కావట్లేదా? తాజా ట్రెండ్‌ ఏదో తెలీక తికమకపడుతున్నారా? అయితే జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, గూగుల్‌ బ్రెయిన్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) తప్పక మీకు ఉపయోగపడుతుంది. 

ఈ ప్రాజెక్ట్‌ రూపకర్త అలెగ్జాండర్‌ క్లెగ్‌ మాట్లాడుతూ.. వేసుకోవాల్సిన డ్రెస్‌ ఎంపిక కాస్త కష్టమైన అంశమని, దీనికై ఆ వ్యక్తి అభిరుచిని కూడా పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని మెషీన్‌ లెర్నింగ్‌ విధానం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు నేర్పిస్తున్నామని తెలిపారు. దీనికై యానిమేషన్‌ సహకారం తీసుకుంటున్నామని, యానిమేషన్ క్యారెక్టర్ల ద్వారా వేలాది ట్రయల్స్‌లో తగిన దుస్తులు ఎంపిక చేసేలా శిక్షణ ఇస్తున్నామని స్పష్టం చేశారు. 

రీఎన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ ద్వారా పెద్ద పనులను చిన్న టాస్క్‌లాగా విభజించుకొని పని చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, రోజూవారీ జీవితంలో పనిచేసేలా ట్రైనింగ్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి యానిమేషన్‌ క్యారెక్టర్స్‌కు వివిధ దుస్తులను ఎంపిక చేసేలా రూపొందించిన ఏఐని టోక్యోలో జరుగనున్న సిగ్రాఫ్‌ ఆసియా 2018 కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించనున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top