మనోహరమైన మున్నార్..! | Munnar lovely ..! | Sakshi
Sakshi News home page

మనోహరమైన మున్నార్..!

Jul 10 2014 11:43 PM | Updated on Aug 14 2018 4:01 PM

మనోహరమైన మున్నార్..! - Sakshi

మనోహరమైన మున్నార్..!

నేడు చాలామంది మానసిక ఒత్తిడి నుంచి దూరం అవాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వెదుక్కుంటూ ప్రకృతి వనాలున్నచోటుకు వెళ్లాలని తపిస్తున్నారు.

నేడు చాలామంది మానసిక ఒత్తిడి నుంచి దూరం అవాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వెదుక్కుంటూ ప్రకృతి వనాలున్నచోటుకు వెళ్లాలని తపిస్తున్నారు. ఆ కోవలో పర్యాటకులను అమితంగా ఆకర్షించే ప్రాంతం మున్నార్. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆకుపచ్చని తేయాకు తోటల్లో మీ సెలవుదినాలను ఎంజాయ్ చేయవచ్చు.

ఏర్కాడు, ఏలగిరి, తేక్కడితో పాటు ఊటీ, కొడెకైనాల్‌లు మున్నార్‌కు దగ్గరలోనే ఉన్నాయి. అద్భుతమైన సెలవు దినాలలో మూడు రాత్రులు, నాలుగు పగళ్ల కోసం రూ.17,010 చెల్లిస్తే చాలు. ఇందులోనే అల్పాహారం, లంచ్, డిన్నర్, విమానాశ్రయానికి చేర్చడం వంటి అవకాశాలు కల్పించారు. అతిథుల సౌకర్యం కోసం 10 శాతం డిస్కౌంట్‌తో రూమ్ డైనింగ్, లాండ్రీ సౌకర్యాలున్నాయి. అత్యంత రద్దీగల ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పిల్లలు, పెద్దలు వినోదాన్ని పొందే సౌకర్యాలూ ఉన్నాయి.

మూడు రాత్రులు, నాలుగు పగళ్లు మున్నార్, తేక్కడిలో గడపచ్చు. ఇందుకు ప్యాకేజీ ధర రూ.32,000. దీంట్లోనే పెద్దలకు ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మసాజ్, సుగంధద్రవ్యపు తోటల సందర్శన, మున్నార్‌లోని ఇతర ప్రదేశాల సందర్శన అవకాశం కల్పిస్తారు. మరిన్ని వివరాలకు: http://bookings.sterlingholidays.com/packages/monsoon/ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement