నువ్వు లేని రోజు | a love story | Sakshi
Sakshi News home page

నువ్వు లేని రోజు

Feb 14 2018 1:35 AM | Updated on Feb 14 2018 1:35 AM

a love story - Sakshi

ఒకరోజు సాయంత్రం అమ్మాయి, అబ్బాయి సినిమా చూసి తిరిగివస్తున్నారు. అప్పటికే సూర్యుడు అస్తమించాడు. నెమ్మదిగా చీకటి మొదలవుతోంది. కారులో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నట్టే ఉన్నారుగానీ వాళ్ల మధ్య చాలాదూరం పెరిగినట్టయింది. ఇద్దరి మధ్యా ఉన్న ఇబ్బందికరమైన మౌనాన్ని బట్టి, బంధంలో ఏదో తేడా కొడుతోందని అబ్బాయి గ్రహించాడు. చివరగా అమ్మాయి మౌనాన్ని ఛేదిస్తూ నోరు విప్పింది. ‘‘శేఖర్, నేనో విషయం నీతో నిజాయితీగా చెప్పాలనుకుంటున్నాను. నీ పట్ల నా ఫీలింగ్స్‌ ఇదివరకులా లేవు. మనం స్నేహంగా విడిపోదాం.’’

ఆ మాటతో అబ్బాయి చెంప మీది నుంచి ఒక సన్నటి ధార కారింది. అతడు తన జేబులోంచి ఒక చిన్న కాగితాన్ని తీశాడు. ఏమీ మాట్లాడకుండా ఆమె చేతికి అందించాడు. అదే సమయంలో హఠాత్తుగా వాళ్ల కారును ఇంకో కారు వచ్చి ఢీకొట్టింది. అబ్బాయి అక్కడికక్కడే మరణించాడు. అదృష్టవశాత్తూ అమ్మాయి ప్రాణాలు దక్కాయి. తనను తాను కూడదీసుకున్నాక, అమ్మాయి తన చేతిలో ఉన్న కాగితపు ముక్కను తెరిచింది. అందులో ఇలావుంది: ‘నీ ప్రేమ లేని రోజున నేను బతకలేను’. ఇప్పుడు అమ్మాయి కళ్లలోంచి నీళ్లు కారుతున్నాయి. అబ్బాయి తనకు తెలియకుండానే తన వాక్యానికి అద్దమై జీవించాడు. ఆ అద్దం పగలకుండా మిగిలే భాగ్యం లేకపోయెనే అని అమ్మాయి దుఃఖిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement