
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా.. మీరు చెప్పే ఆన్సర్ స్టైల్ సూపర్!!
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా.. మీరు చెప్పే ఆన్సర్ స్టైల్ సూపర్!! నేను త్రీ ఇయర్స్ నుంచి నరేష్‌ని లవ్ చేస్తున్నా. తనే ఫస్ట్ ప్రపోజ్ చేశాడు. తన కేరింగ్ చూసి ఒప్పుకున్నా. కానీ ఇప్పుడు తన మరదలు అంటే ఇష్టమని, తను చావమన్నా చస్తుందని అంటున్నాడు. మరదలుకి కూడా తనంటే ఇష్టం. సరే నన్ను వదిలెయ్ అంటే నువ్వంటే ప్రేమ, తనంటే ఇష్టం.. నిన్ను వదులుకోలేను అంటున్నాడు. కానీ ఆ అమ్మాయికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు ఇష్టానికి, ప్రేమకి తేడా ఏంటి? – హస్మ
ఏంటి సార్... అలా ఉన్నారు!?’ హస్మ..! హ్‌మ్‌మ్æ.. హస్మా.. ఏమన్నది?’ హస్మ...!! ఏంటి సార్ కక్కలేకా మింగలేకా...?’ హస్మా....!! అయ్యో.. గొంతుకు అరటిపండు ఏమయినా అడ్డం పడిందా సార్?చెల్లెల్ని చూసి బాధపడుతున్నా..! దాంట్లో కొత్తేముంది సార్.. మీరు ఎప్పుడూ సిస్టర్స్ కోసం తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు కదా సార్?’ అబ్బాయి మీద చచ్చేంత కోపం వస్తోంది! వాట్ ఈజ్ న్యూ... మీకు అబ్బాయిలంటే పిచ్చ కోపం కదా?’ అది కాదు వాడు వట్టి రాస్కెల్... మోసం చేస్తున్నాడు.. ఈ పిల్లకు ఎందుకు అర్థం కావడం లేదు? మీరున్నారుకదా సార్ అర్థమయ్యేలా చెప్పండి’ వద్దు వస్తున్నాయి!
అయ్యో పేపర్ సార్ అలాంటి తిట్లు నాట్ ఎలవ్డ్ సార్!’ మరి నువ్వే చెప్పు నీకు అలా ఎవరయినా చేస్తే ఏం చేస్తావు? నాతో అలాంటి గేమ్స్ ఆడితే వీపు విమానం మోత మోగిపోవాల్సిందే కానీ మీ సిస్టర్స్ చాలా సెన్సిటివ్ కదా ‘యాక్’ అని వాడిని తన లైఫ్‌లోనుంచి తోసి పారేయాలి సార్! శహభాష్ నీలాంబరి, ఇంద అరటిపండు!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com