లిప్‌స్టిక్ వాడుతున్నారా? | Lipstick used? | Sakshi
Sakshi News home page

లిప్‌స్టిక్ వాడుతున్నారా?

Apr 2 2014 11:52 PM | Updated on Sep 2 2017 5:29 AM

లిప్‌స్టిక్ వాడుతున్నారా?

లిప్‌స్టిక్ వాడుతున్నారా?

పెదాలకు రంగు వేసుకొని ముచ్చటపడేవారు చాలామందే ఉంటారు. కానీ వారి చర్మరంగు, దుస్తుల మ్యాచింగ్ ఇవేవీ...

పెదాలకు రంగు వేసుకొని ముచ్చటపడేవారు చాలామందే ఉంటారు. కానీ వారి చర్మరంగు, దుస్తుల మ్యాచింగ్ ఇవేవీ పట్టించుకోకుండా లిప్‌స్టిక్ వాడితే అందంగా ఉండటానికి బదులు ఎబ్బెట్టుగా ఉంటుంది. వేసవిలో లిప్‌స్టిక్ వాడేవారికి కొన్ని సూచనలు...
 
ముదురు రంగులకు దూరం: పెదవులకు ముదురురంగు లిప్‌స్టిక్ వాడితే పెదాలు చిన్నగా కనిపిస్తాయి. పెదవుల రంగులోనే కనిపించాలంటే న్యూడ్ లేదా క్లియర్ షేడ్స్ గల లిప్‌స్టిక్‌ను ఎంచుకోవాలి. అప్పుడే పెదవులు సహజమైన కాంతితో కనిపిస్తాయి.
 
షాడో తప్పనిసరి: ముదురు గోధుమ రంగు, వాటర్‌ఫ్రూఫ్ ఐలైనర్‌తో కిందిపెదవి అంచు వద్ద చిన్న లైన్ గీయాలి. తర్వాత లిప్‌స్టిక్ వేసుకోవాలి. ఈ చిన్న మార్క్ వల్ల పెదవులు పెద్దగా, మరింత వంపుతిరిగినట్టు అందంగా కనిపిస్తాయి.
 
గ్లాసీ లిప్‌స్టిక్: ఎంచుకున్న లిప్‌స్టిక్‌తో  పెదవులను తీర్చిదిద్దాక అలాగే వదిలేస్తే జీవం కోల్పోయి కనిపిస్తాయి. పైన కాంతిని ఇచ్చే షైనీ ఫినిష్‌తో టచప్ చేయాలి.
 
పగిలిన పెదవులు: పెదవులపై చర్మం పొడిబారితే మృతకణాలు తేలి, లిప్‌స్టిక్ వేసినా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మెత్తటి టూత్‌బ్రష్‌తో కొద్దిపాటి ఒత్తిడిని కలిగిస్తూ రుద్దాలి. తర్వాత నీటితో కడిగి, లిప్‌బామ్ రాయాలి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement