ముచ్చటైన ముగ్గులకు ఇదే మా ఆహ్వానం

Latest Rangoli Designs for Sankranthi 2020 - Sakshi

సాక్షి : సంక్రాంతి అంటేనే సరదాల పండుగ. ధాన్యం ఇల్లు నిండగా.. కొత్త అల్లుళ్ల సందడి నెలకొనగా తెలుగువారి లోగిళ్లు ఆనందంతో మురిసే వేడుక. ఎంతో ఆనందంగా జరుపుకొనే ఈ పర్వదినానికి అసలైన శోభను తెచ్చేది మాత్రం రంగవల్లులు. అందులో పెట్టే గొబ్బెమ్మలే. తెలుగింటి ఆడపడుచులు తమ ప్రతిభను వాకిళ్లలో ముగ్గుగా తీర్చిదిద్ది.. రంగులు అద్ది ఈ పెద్ద పండుగను మరింత వైభవోపేతం చేస్తారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

అందుకే భోగి మంటలతో మొదలై.. భోగిపళ్లు, పిండివంటలు, డూడూ బసవన్నలు, హరిదాసులతో తెలుగింటి సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ పండుగను పురస్కరించుకుని.. సాక్షి డాట్‌కామ్‌ మహిళల కోసం సంక్రాంతి సందడిని ముందుగానే తీసుకువచ్చింది. మీ చేతుల్లో రూపుదిద్దుకునే రంగవల్లులను ప్రదర్శించే అవకాశం కల్పిస్తోంది. మీరు మీ వేసే, వేయబోయే వినూత్నమైన ముగ్గుల చిత్రాలను మాకు పంపిస్తే వాటిని ప్రచురిస్తాం.

మీ ముగ్గుల ఫోటోలను info@sakshi.com మెయిల్‌కు పంపించండి. లేదా 9010077759 నంబర్‌కు వాట్సప్‌ ద్వారా మీ ముగ్గుల చిత్రాలను పంపొచ్చు. మీరు పంపించే ముగ్గులకు సంబంధించి ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలు.. వంటి వివరాలు సమగ్రంగా ఉండాలి.  మీ పేరు, ఊరు రాయడం మరిచిపోవద్దు. క్లియర్‌గా లేని ముగ్గుల చిత్రాలకు ప్రచురించడం సాధ్యం కాదు. అందుకని మీరు పంపించే ముగ్గులు చాలా స్పష్టంగా ఉండేలా చూడాలి.

మీరు పంపిన ముగ్గుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top