దివ్యదృష్టి

Job that detects the wet brain breast cancer risk with fingertips - Sakshi

చెట్టు నీడ

చూపున్నవాళ్లమే లోకాన్ని ఈదుకుంటూ సాయంత్రానికి ఇంటì  ఒడ్డుకి సరిగా కొట్టుకు రాలేకపోతున్నాం. ఇక నేహా తనెలా బతుకుతుంది? కూతుర్నెలా బతికిస్తుంది?

దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తాడా? చెప్పగల విషయం కాదు. పెద్దాయన పైన ఉంటాడు. ఆయన లోపల ఏముంటుందో కింద ఉండేవాళ్లం మనకు ఎలా తెలుస్తుంది? అయినా, ఇవ్వడానికి తీసుకోవడం ఎందుకూ అనిపిస్తుంది! మనుషులం, మన భయం కొద్దీ దేవుణ్ని పాజిటివ్‌గా తీసుకుంటాం. ‘కులుకుతూ కూర్చున్నావ్, ఏం పట్టించుకోకుండా’ అని దేవుణ్ని పట్టుకుని రామదాసులా తిట్టేస్తే.. ఇంకోటేదైనా ఆయన మన నుంచి తీసేసుకుంటే మళ్లీ అదొక బాధ జీవితానికి. 

రెండేళ్ల క్రితం నేహా సూరి కి ఆ కాస్త కంటి చూపు కూడా పోయింది.  ఒంటరి తల్లి. ఒక టీనేజ్‌ బిడ్డ. నైరాశ్యం. ఉండడం ఢిల్లీలో. చూపున్నవాళ్లమే లోకాన్ని ఈదుకుంటూ సాయంత్రానికి ఇంటì  ఒడ్డుకి సరిగా కొట్టుకు రాలేకపోతున్నాం. ఇక నేహా తనెలా బతుకుతుంది? కూతుర్నెలా బతికిస్తుంది? ఏడాది పాటు ఎలాగో నెట్టుకొచ్చింది. తర్వాత ఆ చీకట్లోకి ఒక వెలుతురు రేఖ ప్రసరించింది. చూపు రాలేదు. చూపుతో పనిలేని ఉద్యోగం వచ్చింది. చేతివేళ్లతో తడిమి బ్రెస్ట్‌ కాన్సర్‌ రిస్క్‌ను కనిపెట్టే ఉద్యోగం అది.  నేహా ఇప్పుడు ‘మెడికల్‌ టాకై్టల్‌ ఎగ్జామినర్‌’ (ఎం.ఇ.టి)! స్పర్శజ్ఞాని. గత మూడు నెలలుగా తన స్పర్శజ్ఞానంతో వట్టి చేతులతో వైద్య పరీక్షలు చేస్తున్నారు నేహా. వక్షోజాలలో, ఆ చుట్టుపక్కల బాహుమూలాల్లో అర సెంటీమీటరు కణితి ఉన్నా ఆమె వేళ్లు కనిపెట్టేస్తాయి. అయితే ఇది తనకై తను వృద్ధి చేసుకున్న జ్ఞానం కాదు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను ముందే కనిపెట్టేందుకు వసంత్‌కుంజ్‌లోని ఫోర్టిస్‌ ఆసుపత్రి శిక్షణ ఇప్పించిన ఏడుగురు అంధ మహిళా ఎం.ఇ.టి.లలో నేహా ఒకరు. వీళ్లది మొదటి బ్యాచ్‌. వీళ్లతోనే ఎం.ఇ.టి. అనే ఒక కోర్సు మొదలైంది! గాంధీ జయంతి రోజు వీరు విధుల్లో చేరారు. ‘ఆప్టిమల్‌ సెన్సరీ టచ్‌’తో.. చెకప్‌ కోసం వచ్చిన మహిళల వక్షోజ భాగాలలోని చిన్నపాటి కణితులను సైతం వీరు గుర్తించగలుగుతారు. వేళ్లతో తగుమాత్రంగానే వక్షోజాలపై ఒత్తిyì  కలిగిస్తూ లోపల ఏమైనా గడ్డల్లాంటివి ఉన్నాయేమో తడిమి చూస్తారు.

అదే.. ఆప్టిమల్‌ సెన్సరీ టచ్‌. కనీసం 35 నుంచి 45 నిమిషాలపాటు వీరి వేళ్లు సునిశితంగా, సూక్ష్మంగా పరీక్ష జరుపుతాయి. మరి బ్రెస్ట్‌ సరిగ్గా ఎక్కడుందో వీళ్లకు లె లిసేదెలా? బ్రెయిలీ చుక్కలు ఉన్న టాకై్టల్‌ రేకులు ఛాతీని నాలుగు భాగాలుగా విభజిస్తూ వీరి వేళ్లకు దారి చూపుతాయి. ఒక్క బ్రెస్టు, ఆ చుట్టుపక్కలే కాకుండా.. వీపులో, మెడభాగంలో కూడా గడ్డలు, కణితుల కోసం వేళ్లు గాలిస్తాయి. శిక్షణలో భాగంగా నేహా, మిగతావాళ్లు గుర్‌గావ్‌లోని మేదంతా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక్కొక్కరూ 30 మంది మహిళలకు పైగా వేళ్లతో వక్షోజ పరీక్షలు జరిపారు. కచ్చితమైన ఫలితాలను రాబట్టారు. ఇండియాలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సర్వసాధారణం అయింది. ప్రతి లక్ష మందిలో 24 మందిలో కనిపిస్తోంది. ముందుగా కనిపెట్టగలిగితే ఈ ఇరవై నాలుగు మంది ప్రాథమిక దశలోనే గట్టెక్కేయొచ్చు. అలా గట్టెక్కించేవారే ఈ ఎం.ఇ.టి.లు.  దేవుడు ఒకటి తీసుకుని ఇంకొకటి ఇస్తాడన్న మాట నిజమే అయితే.. పది మందికి ఇవ్వడం కోసం దేవుడు నేహా దగ్గర్నుంచి, ఆమె బ్యాచ్‌మేట్స్‌ నుంచీ తీసుకున్నాడనుకోవాలి. నేçహా అయితే అలాగే అనుకుంటోంది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top